ఆనందాన్నిచ్చే అందాల వేంకటేశ్వరుడు
సాధారణంగా శ్రీరాముడు ... శ్రీకృష్ణుడు అందమైనవారిగా చెప్పబడుతుంటారు. వారి ఆలయాలలోని విగ్రహాలను చూసి భక్తులు కూడా అదే మాట అనుకుంటూ వుంటారు. అలాగే ఇక్కడి ఆలయంలోని వేంకటేశ్వరస్వామిని చూసినప్పుడు అసలైన అందగాడు ఆయనేనని అనిపిస్తుంది. అలాంటి అందాల వేంకటేశ్వరస్వామిని భక్తుల హృదయాల్లో నిలిపే ఆ దేవాలయం, హైదరాబాద్ లోని సంఘీనగర్ లో దర్శనమిస్తుంది.
కొండపై అందంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయం, ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతుంటుంది. కొండపైకి ఇటు మెట్ల మార్గంలోనూ ... అటు వాహనాలపై ఘాట్ రోడ్ ద్వారా చేరుకోవచ్చు. రాజగోపురం దాటుకుని లోపలికి ప్రవేశిస్తే, పచ్చదనం మధ్య స్వామి కొలువుదీరి ఉన్నట్టుగా కనిపిస్తూ వుంటుంది.
రాజగోపురానికి ఎదురుగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, ప్రధాన ఆలయంగా కనిపిస్తూ వుంటుంది. ఎత్తైన వేదికలా ప్రదానమంటపం రూపొందించారు. ఇక్కడి నుంచే స్వామివారి దర్శనం చేసుకోవాలి. గర్భాలయంలో స్వామివారి విగ్రహం దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు వరకూ వుంటుంది. చక్కని కనుముక్కుతీరుతో ... విశాలమైన వక్షస్థలంతో ... తీరైన నామాలతో స్వామివారు నయనమనోహరంగా దర్శనమిస్తూ వుంటాడు.
వివిధ రకాల ఆభరణాలతోను ... పూలమాలికలతోను అలంకారం చేశాక ఇక స్వామివారిని చూడాలంటే వేయికళ్లు కావాలనిపిస్తుంది. ప్రతి శనివారం భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. స్వామివారి ఆలయానికి ఓ వైపున గల ప్రత్యేక ఆలయంలో పద్మావతీ అమ్మవారుకొలువై పూజలు అందుకుంటూ వుంటుంది. మరో వైపున శివాలయం దర్శన మిస్తుంటుంది. ఈ మధ్యలో అష్టలక్ష్మీ స్థూపం ... ఇతర పరివార దేవతల మందిరాలు కూడా దర్శనమిస్తూ వుంటాయి.
హరిహర క్షేత్రంగా అలరారుతోన్న ఈ క్షేత్రంలో ప్రతి ఆలయానికి ప్రదక్షిణలు చేసుకోవడానికి అవకాశం వుండటం విశేషం. పర్వదినాల సమయంలో ఇటు వేంకటేశ్వరస్వామికి ... అటు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వుంటారు. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా వుండటం వలన, ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసిక ప్రశాంతత కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. స్వామివారి దివ్య దర్శనంతో పులకిస్తూ ఆనందానుభూతులు పొందుతుంటారు.