భవనాశిని తీర్థం
సంసారమంటేనే సాగరం ... సాగరాన్ని ఈదడం ఎంత కష్టమో సంసారాన్ని నడపడం అంత కష్టమన్నారు పెద్దలు. సాగరంలో కెరటాలు వుండటం ఎంత సహజమో, సంసారంలో సమస్యలు వుండటం అంతే సహజమని ఎంతోమంది అనుభవపూర్వకంగా సెలవిచ్చారు. సాక్షాత్తు పురాణ పురుషులు సైతం సంసార సాగరాన్ని దాటడం అంతతేలిక కాదనే విషయాన్ని అంగీకరించారు.
సంసార జీవితమే వ్యామోహాలకు ... మమకారాలకు ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. అలాంటి సంసారాన్ని కొనసాగిస్తూనే భగవంతుడిని చేరుకోవడం అంత ఆషామాషీ విషయం కాదు. ఎన్ని కష్టాలు వున్నా మోక్షమనే తీరాన్ని చేరుకోవాలంటే సంసారమనే సాగరంలోకి దిగక తప్పదని పెద్దలు సెలవిచ్చారు. దాంతో సంసార సంబంధమైన కష్టాలను ఎదుర్కుంటూనే, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి క్షేత్ర దర్శనాలు చేస్తుండటం జరుగుతూ వుంటుంది.
ఇక ఇలా సంసారమనే జీవననౌకలో ప్రయాణం చేస్తున్న వారి కష్టాలను తొలగించి పుణ్యాన్ని ప్రసాదించడానికి 'అహోబిలం'లో 'భవనాశిని' అనే పవిత్ర తీర్థం వుంది. సంసార పరమైన కష్టాలను తొలగించే తీర్థం కావడం వలన 'భవనాశిని' అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ తీర్థాన్ని భగవంతుడు ప్రసాదించిన ఒక అపూర్వమైన వరంగా భక్తులు భావిస్తుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన వాళ్లు ఈ తీర్థంలో స్నానం చేసి పునీతులవుతుంటారు.
నరసింహ స్వామి తొమ్మిది రూపాలలో కొలువై వున్న ఈ క్షేత్రంలో, రామ .. లక్ష్మణ .. భీమ .. వరాహ .. భైరవ .. నరసింహ .. సుదర్శన .. శంఖ .. వినాయక .. సూత .. రజత .. ధారా .. గజ అనే పవిత్ర తీర్థాలు వున్నాయి. భగవంతుడి లీల విశేషంగా చెప్పబడుతోన్న ఈ తీర్థాలన్నీ కూడా 'భవనాశిని' తీర్థంలో కలుస్తుంటాయి. ఈ కారణంగానే ఈ తీర్థం అత్యంత పవిత్రమైనదనీ ... మహిమాన్వితమైనదని అంటారు.