దేవుడి రథం
ప్రాచీనకాలం నుంచి నేటి వరకూ దేవుడికి సంబంధించిన ప్రతి ఉత్సవంలోను 'రథం' ప్రధానపాత్రను పోషిస్తూ వస్తోంది. స్వామివారికి ఎన్ని వాహన సేవలు ఉన్నప్పటికీ, ఆయన రథంపై ఊరేగుతున్నప్పటి వైభవం వేరు ... ఆ సమయంలో భక్తులు పొందే ఆనందం వేరు ... అనుభూతి వేరు. రథంపై ఊరేగుతున్న విష్ణుమూర్తిని చూడటం వలన పునర్జన్మ ఉండదని పురాణాలే చెబుతున్నాయి.
ఈ కారణంగానే మిగతా వాహనాలకి సంబంధించిన ఊరేగింపుల కన్నా రథోత్సవం ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ప్రతి క్షేత్రంలోను భక్తులందరూ రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొంటారు. రెండువైపులా కట్టిన తాళ్లతో రథాన్ని లాగుతూ స్వామిసేవలో అనంతమైన ఆనందాన్ని పొందుతూ వుంటారు.
పూర్వం ఈ రథాలు అయిదు ... ఏడు అంతస్తులను కలిగి చాలా ఎత్తుగా ఉండేవి. వివిధ రకాల నగిషీలు చేయబడిన ఈ రథాలు అలంకరణ తరువాత పుష్పక విమానాలను తలపిస్తూ ఉండేవి. రథం మొత్తం కూడా చెక్కతో తయారుచేసేవారు. కొన్ని క్షేత్రాల్లో రాతి చక్రాలను అమర్చితే ... మరికొన్ని క్షేత్రాలలో చక్రాలు కూడా చెక్కతోనే రూపొందించేవారు. అవసరమైన చోటమాత్రమే ఇనుమును ఉపయోగించేవారు.
ఇక మిగతా రోజుల్లో ఇది ఎండకి ఎండకుండా ... వానకి తడవకుండా వుండటం కోసం ఎత్తైన షెడ్డును ఏర్పాటు చేసేవారు. ఇదే పరిస్థితి గ్రామాల్లోను కనిపిస్తూ వుండేది. అయితే ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లో మినహా మిగతా చోట్లా రథం యొక్క ఎత్తును తగ్గిస్తూ వస్తున్నారు. ఇక ఎక్కువకాలం పాడైపోకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇనుమునే ఎక్కువగా వాడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆధునిక ఆలయాలలో పూర్తిగా ఇనుముతో తయారుచేసిన చిన్నపాటి రథాలను ఉపయోగిస్తున్నారు. రథం చిన్నదైతే దానిని లాగడం తేలిక అవుతుందనే ఆలోచన చేసినప్పుడు దానిని పూర్తిగా చెక్కతోనే చేయించాలని శాస్త్రం చెబుతోంది. ఇనుముతో చేసిన రథంపై స్వామివారిని ఊరేగించడం వలన దోషం కలుగుతుందని స్పష్టం చేస్తోంది.