పాండవులు దర్శించిన క్షేత్రాలు
దక్షిణ భారతంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలను దర్శిస్తే అక్కడ తప్పకుండా పాండవుల పేరు వినిపిస్తుంది. పాండవులు ఆ ప్రదేశంలో తిరుగాడారనో ... శివలింగాలను ప్రతిష్ఠించారనో ... మందిరాలు నిర్మించారనో చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా స్థలపురాణంతో పాటు ఆయా ఆనవాళ్లు కూడా కనిపిస్తుంటాయి. పాండవుల గుళ్లు ... పాండవతీర్థం ... భీముని కొలను ... ఇలా ఎన్నో ఆనవాళ్లు పాండవుల ఉనికిని చాటుతూ వుంటాయి.
ఇక ఉత్తర భారతంలోనూ వివిధ క్షేత్రాలలో పాండవుల ప్రస్తావన వినిపిస్తూ వుంటుంది. ఈ క్షేత్రాలను పాండవులు దర్శించడానికి కారణమైన కథ కూడా ఆసక్తికరంగా వుంటుంది. మహాభారత యుద్ధంలో తమ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో, ఆ పాపాలను హరింపచేసుకోవడానికి అంతా కలిసి కాశీ క్షేత్రానికి చేరుకుంటారు. అయితే వారికి పంచకేదారాల దర్శనం చేయించి, వారి పాపాలను ప్రక్షాళన చేయాలని శివుడు నిర్ణయించుకుంటాడు.
దాంతో తాను కాశీ క్షేత్రంలో లేననీ, నంది రూపంలో పంచ కేదారాల దిశగా వెళ్లానని పాండవులకు తెలిసేలా చేస్తాడు. ఎలాగైనా ఆయన దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో పాండవులు ఆ దిశగా బయలుదేరుతారు. అలా కొంతకాలం పాటు ప్రయాణించిన పాండవులకు నందిరూపంలో శివుడు కనిపించి అదృశ్యమవుతాడు. ఆయన నాభి స్థానం గల ప్రదేశంలో వారికి ఒక శివలింగం కనిపిస్తుంది. అదే పంచ కేదారాలలో ఒకటైన 'మధ్యమాహేశ్వరం' అనే క్షేత్రం. ఆయన పాద స్పర్శచే పాపాలు పటాపంచలు చేసుకోవడం కోసం పాండవులు ఆయన అడుగుజాడలు పరిశీలిస్తూ వెళతారు.
అప్పుడు వారికి 'కేదారనాథ్' లో లింగాకారంలో నంది యొక్క మూపురభాగం కనిపిస్తుంది. ఆ తరువాత 'తుంగనాథ్' లో లింగాకారంలో గల శివుడి చేతులను ... 'రుద్రనాథ్' లో లింగా కారంలో గల నంది ముఖభాగాన్ని ... 'కల్పనాథ్' లో లింగాకారంలో గల శివుడి కొప్పును పాండవులు దర్శించుకుంటారు. శివానుగ్రహంతో ఈ పంచ కేదారాలను దర్శించుకోవడం వల్లనే పాండవుల పాపాలు నశించాయి ... వారికి ఉత్తమగతులు లభించాయి.