ధాన్యం ఇచ్చిన దైవం
ఒకసారి రాఘవేంద్రస్వామిని తంజావూరు ప్రభువు కలుసుకుంటాడు. ఆయన ఆందోళనను ... ఆవేదనను స్వామి గ్రహిస్తాడు. తంజావూరు కరవుకాటకాలకు నెలవుగా మారిందని స్వామితో బాధగా చెబుతాడు ప్రభువు. ప్రజలు ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారని అంటాడు. తన రాజ్యానికి వచ్చి పరిస్థితిని గమనించవలసిందిగా వేడుకుంటాడు.
స్వామి తన రాజ్యానికి వస్తే ఆయన పాదస్పర్శ కారణంగా తాము చేసిన పాపాలు నశిస్తాయనీ, ఫలితంగా కరవు కోరల నుంచి తన రాజ్యం బయటపడుతుందని అంటాడు. తంజావూరు ప్రభువు అంతగా ప్రాధేయపడుతూ ఉండటంతో అతనితో కలిసి స్వామి బయలుదేరతాడు. ప్రభువు మందిరానికి చేరుకునే లోగా అక్కడి పరిస్థితులను స్వామి గ్రహిస్తాడు. వెంటనే వారి ఆకలిని తీర్చవలసిన అవసరాన్ని గుర్తిస్తాడు.
ప్రభువుల అధీనంలో వుండే ధాన్యాగారం దగ్గరికి స్వామి చేరుకుంటాడు. ధాన్యాగారం ఖాళీ చేసి చాలా రోజులైందని చెబుతాడు ప్రభువు. ఆ ధాన్యాగారానికి గల అన్ని ద్వారాలను మూసివేసి ఒక వైపున మాత్రమే రంధ్రం చేయించమని స్వామి చెప్పడంతో, ఆయన క్షణాల్లో ఆ పని చేయిస్తాడు. ఆ రంధ్రంలో నుంచి ధాన్యం రావడానికి వీలుగా స్వామి ఏర్పాట్లు చేయిస్తాడు. అక్కడి ప్రజలను వచ్చి ధాన్యం తీసుకువెళ్లవలసిందిగా చాటింపు వేయించమని చెబుతాడు.
ధాన్యాగారానికి చేయించిన రంధ్రం పై స్వామి ఏవో బీజాక్షరాలు రాసి దైవాన్ని ప్రార్ధిస్తాడు. ధాన్యాగారంలో చేయిపెట్టి కొంత ధాన్యం తీసి ప్రభువు దోసిలిలో వుంచుతాడు. అంతే ప్రభువు సంతోషంతో పొంగిపోతాడు. ప్రజలకు ధాన్యం కొలిచి ఇవ్వమని తన మనుషులను పురమాయిస్తాడు. ధాన్యాగారం నుంచి ధారగా పడుతోన్న ధాన్యాన్ని అక్కడి వాళ్లు బస్తాల్లోకి ఎత్తి ప్రజలకు సమానంగా పంచుతుంటారు. తమ ఆకలి తీర్చిన రాఘవేంద్రస్వామికి ప్రభువుతో పాటు ప్రజలంతా సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.