పుణ్యమే కాపాడుతుంది
'చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా' అనే సామెతను చాలా సందర్భాల్లో చాలా మంది అంటూ వుండగా వింటూ వుంటాం. అంటే చేసే పనిని బట్టి దాని ఫలితం ఉంటుందని అర్థం. మంచిపనులు చేయడం వలన ఫలితం మంచిగా వుంటుంది. ఇక చెడు పనులు చేయడం వలన లభించే ఫలితం కూడా చెడుగానే వుంటుంది. ఇది పాపపుణ్యాల విషయంలో ఎక్కువగా ప్రస్తావనకు వస్తూ వుంటుంది.
పుణ్యం కాపాడుతుంది ... పాపం వెంటాడుతుందని పెద్దలు అంటూ వుంటారు. ఈ లోకంలో చేసుకున్న పుణ్యం మాత్రమే పైలోకానికి తోడుగా వస్తుంది. భగవంతుడు కల్పించినది ఇతరులతో కలిసి పంచుకున్నప్పుడే ఆయన సంతోషిస్తాడు. ప్రతి ఒక్కరూ తోటివారితో పాటు మూగజీవాలను కూడా ప్రేమించాలి. జీవించే హక్కు ప్రతి జీవికి ఉందనే విషయాన్ని గుర్తించి, వాటి ఆహారానికి ... గూడుకి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలి.
అలా చూసుకోవాలనే ఉద్దేశంతోనే భగవంతుడు ఒక్కో ప్రాణి వలన మానవుడికి ఎన్నో ఉపయోగాలు కలిగేలా చేశాడు. ఈ జీవులపట్ల దయ కలిగి వుండటం, వాటి జీవనానికి అవసరమైన ఆహారం ... నీరు సమకూర్చడం ... వాటి నివాసాలకు ఇబ్బంది కలగకుండా చూడటం కూడా పుణ్యం కిందికే వస్తుంది. అందువల్లనే పూర్వం ఇంట్లో పిచ్చుకలు గూడు పెడితే వాటిని తొలగించే వాళ్లు కాదు. అలాగే తమ ఇంటి ఆవరణలో తేనెపట్టు పెడితే దానిని తీసేవాళ్లు కాదు.
ఇక ఏ ఇంట్లో అయినా గర్భవతులు వుంటే, ఆ ఇంటి వాళ్లు కందిరీగ పెట్టుకున్న గూడును కదిలించడానికి కూడా సాహసం చేయరు. అంటే సమస్త జీవరాశి పట్ల భూత దయను కలిగి ఉన్నప్పుడే భగవంతుడు కూడా తమని మంచిగా చూస్తాడని అంతా విశ్వసిస్తుంటారు. ఈ విశ్వాసమే భూతదయతో వ్యవహరించడానికి కారణమవుతుంది ... ఆ భూతదయే పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది ... ఆ పుణ్యమే ఉత్తమ గతులను ప్రసాదిస్తుంది.