వరాల నిచ్చే వాసవీ క్షేత్రం
జీవితమన్నాక ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవలసి వుంటుంది. మరెన్నో కష్ట నష్టాలను ఓర్చు కోవలసి వుంటుంది. అయితే ఒక స్థాయి కష్టాలను మాత్రమే ఎవరైనా ఎదుర్కోగలుగుతారు. ఆ స్థాయిని దాటితే ప్రతి ఒక్కరూ ఆ కష్టాలను తీర్చే బాధ్యతను దైవం పైనే వేస్తుంటారు. తన పట్ల భక్తులకు గల విశ్వాసాన్ని బట్టి, నియమబద్ధమైన ... నిస్వార్ధపరమైన వారి జీవన విధానాన్ని బట్టి దైవం అనుగ్రహిస్తూ వుంటుంది.
ఈ నేపథ్యంలో అసలు తమ కష్టాలను వినడానికంటూ ఇష్ట దైవం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, భక్త బృందాలు ఆలయాల నిర్మాణాన్ని చేపడుతుంటాయి. ఈ కారణంగా మనకి వివిధ ప్రాంతాల్లో అనేక దేవాలయాలు కనిపిస్తూ వుంటాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలోని 'బంగారుగడ్డ' ప్రాంతంలో నిర్మించబడిన 'శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి' ఆలయం కూడా ఈ నేపథ్యంలోనిదే.
ఇక్కడి భక్తులు చాలాకాలం క్రిందటే తమ అభిరుచికి అనుకూలంగా అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. నాటి నుంచి నిత్య ధూప .. దీప .. నైవేద్యాలు జరుగుతూ వస్తున్నాయి. ఆలయ నిర్మాణ శైలి ... అందమైన నగిషీలు అమ్మవారి వైభవానికి అద్దంపడుతూ వుంటాయి. గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తి అణువణువునా సౌందర్యం ఉట్టిపడుతూ, సర్వాలంకారాలతో కళకళలాడుతూ కనిపిస్తూ వుంటుంది.
గురువారం ... ఆదివారం రోజుల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక విశేషమైన పర్వదినాల్లోను ... కార్తీక మాసంలోను అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఇక్కడి అమ్మవారు కోరిన వెంటనే సిరిసంపదలను ... సంతాన సౌభాగ్యాలను ఇస్తుందని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు ... అనునిత్యం అమ్మవారిని సేవిస్తూ తరిస్తుంటారు.