కార్తీకంలో నవనందుల దర్శనం
పుణ్య ఫలాలను పుష్కళంగా అందించడంలో కార్తీకమాసానికి మించిన మాసం మరొకటి కనిపించదు. ఈ మాసంలో వివిధ క్షేత్రాలను దర్శించడానికీ, శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి అందరూ ప్రయత్నిస్తుంటారు. ఇక సమయాభావం వలన కొంతమంది తాము అనుకున్న క్షేత్రాలకి వెళ్లలేకపోతుంటారు. ఇలాంటి వాళ్లు దైవ దర్శనం త్వరగా లభించి ... ఎక్కువ సంతృప్తిని ఇచ్చే దగ్గరలోగల క్షేత్రాలకి వెళ్లాలని అనుకుంటూ వుంటారు.
అలాంటి వారికి 'మాహానంది' ని మించిన మరో క్షేత్రం కనిపించదు. కార్తీక మాసంలో దర్శన మాత్రం చేతనే కరిగిపోయి కరుణించే శివుడు ఇక్కడ 'నవనందులు' గా లింగరూపంలో దర్శనమిస్తూ వుంటాడు. నంది తనకి చేస్తోన్న సేవలకి మెచ్చిన శివుడు, ఈ క్షేత్రాలు ఆయన పేరుమీద ప్రసిద్ధి చెందేలా వరాన్ని ప్రసాదించాడట.
ఈ కారణంగానే ఈ ప్రాంతంలో గల తొమ్మిది శివలింగాలు 'ప్రధమ నంది' .. 'నాగనంది' .. 'సోమనంది' .. 'శివనంది' .. 'సూర్యనంది' .. 'విష్ణునంది .. 'మహానంది' .. 'వినాయక నంది' .. 'గరుడనంది' గా పిలవబడుతున్నాయి. సహజంగానే స్వామి వారి ఎదురుగా నందీశ్వరుడు కొలువై వుంటాడు. ఈ నవనందులలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ... ఒక్కో విశిష్టత వుంది.
ఇవన్నీ కూడా మహానంది క్షేత్రానికి 30 కిలోమీటర్ల పరిధిలోనే కనిపిస్తుంటాయి. కనుక ఈ నవనందులను ఒకే రోజులో దర్శించుకోవచ్చు. ఈ విధంగా కార్తీక మాసంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోగా ఈ నవనందులను దర్శించుకోవడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది. ఆరోగ్యం ... సంతానం ... సౌభాగ్యం ... సంపదలు కలుగుతాయని అంతా విశ్వసిస్తుంటారు.