విశ్వాసమే రక్షణ కవచమన్న బాబా
శిరిడీ సాయిబాబాకి ఆశ్రయం ఇచ్చిన మశీదు ఎప్పుడు చూసినా భక్తులతో సందడిగా కనిపిస్తూ వుండేది. ఇక్కడికి వచ్చిన భక్తులు బాబాను దర్శించుకుని తమ అవస్థలు ... ఆవేదనలు ఆయనకి చెప్పుకునేవారు. ఆత్మీయమైన బాబా పలకరింపుతోనే వాళ్లు తమ కష్టాలను అక్కడే మరిచిపోయేవారు. తన దర్శనార్థం వచ్చే భక్తులతో ఆయన ఎంతో చనువుగా ఉంటూ ఉండేవాడు.
అలా వచ్చిన వారికి ఒక్కోసారి ఆయనే వంటచేసి స్వయంగా వడ్డించేవారు. వాళ్లు కడుపునిండుగా తింటే సంతృప్తితో పొంగిపోయేవారు. ఇలాంటి సందర్భాల్లో భక్తులు కొందరు బాబాతో కలిసి భోజనం చేయాలని అనుకునేవారు. అలాంటి వారికి బాబా అవకాశం కల్పించేవాడు. అలా ఒకసారి బాబా స్వయంగా వంట చేసి, తన సహచరులతో పాటు, అక్కడికి వచ్చిన వారికి కూడా వడ్డించాడు. ఆ తరువాత తాను వడ్డించుకుని అదే పంక్తిలో కూర్చున్నాడు.
అందరూ భోజనాలు చేస్తుండగా, పెద్ద శబ్దం చేస్తూ మశీదు పైకప్పు కూలసాగింది. అది చూసిన భక్తులు భోజనం చేయడం మానేసి బయటికి పరిగెత్తారు. బాబాను ... ఆయన సహచరులను బయటికి రమ్మంటూ తొందర చేయసాగారు. కూలుతున్న పైకప్పు కేసి చూసిన బాబా , కాసేపు ఆగమంటూ అరిచాడు. అంతే మంత్రం వేసినట్టుగా కూలబోతున్న భాగాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి.
బాబాతో పాటు ఆయన సహచరులు నిదానంగా భోజనం చేసి బయటికి వచ్చారు. అప్పుడు బాబా ఆ మశీదు పై కప్పుకేసి చూస్తూ కూలడానికి అనుమతి ఇస్తున్నట్టుగా చెప్పాడు. అంతే ఒక్కసారిగా అది కూలిపోయింది. మశీదులో నుంచి భోజనం మధ్యలోనే పరిగెత్తుకుని వచ్చిన వాళ్లు ఈ దృశ్యం చూసి నివ్వెరపోయారు.
ఆపదలో ఆదుకునే దేవుడు పక్కనే ఉన్నప్పటికీ, అజ్ఞానంతో ఆ విషయాన్ని మరిచిపోయి ప్రవర్తించినందుకు సిగ్గుపడ్డారు. తమని మన్నించమంటూ ఆయన పాదాలపై పడ్డారు. విశ్వాసమే రక్షణ కవచమనీ, విశ్వంలో ఎక్కడ వున్నా అదే కాపాడుతుందని వాళ్లతో చెప్పాడు బాబా. ఆ విశ్వాసాన్ని కలిగివున్న వారి వెంట తానెప్పుడూ ఉంటానంటూ వాళ్ల కళ్లు తెరిపించాడు.