బెజవాడ మల్లన్న
విజయవాడలో కనకదుర్గా దేవి ఆవిర్భవించిన 'ఇంద్ర కీలాద్రి'పైనే మల్లేశ్వరుడు కూడా అవతరించాడు. ఇక్కడ బ్రహ్మ దేవుడితో మల్లికా పుష్పాలచే పూజలు అందుకున్న కారణంగా మల్లేశ్వరుడనీ ... దుర్గాదేవికి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్న కారణంగా దుర్గా మల్లే శ్వరుడనీ... బెజవాడలో కొలువుదీరిన కారణంగా బెజవాడ మల్లేశ్వరుడని పిలవబడుతున్నాడు. 'వాడపల్లి' ... 'మట్టపల్లి' ... 'వేదాద్రి' క్షేత్రాలను దర్శించిన అగస్త్యుడు, బెజవాడ మల్లేశ్వరుడిని దర్శించుకున్నట్టుగా స్థల పురాణం చెబుతోంది.
బ్రహ్మదేవుడు అర్చించిన మల్లేశ్వర లింగం కాలక్రమంలో అంతర్హితమైంది. పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ వెళుతూ ఇక్కడికి వచ్చిన ఆది శంకరాచార్యుల వారు ఆ విషయాన్ని గ్రహించారు. అమ్మవారు ఒంటరిగా వుండటం ఇటు క్షేత్రానికీ ... అటు దేశానికి మంచిది కాదని భావించి, ఉత్తర దిశలో మల్లేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు. అమ్మవారితో అయ్యవారి కల్యాణాన్ని జరిపించారు. ఆ రోజు నుంచి ప్రతి ఏడాది 'చైత్ర శుద్ధ పౌర్ణమి'కి కల్యాణోత్సవం జరిపించబడుతుంది. ఈ కల్యాణ మహోత్సవం వసంత రుతువులో జరుగుతుంది కనుక దీనిని వసంత కల్యాణోత్సవమని పిలుస్తుంటారు.
నేత్రపర్వంగా జరిగే ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. పూర్వం వేంగీ దేశం నుంచి శ్రీ శైలం బయలుదేరిన భక్తులు ముందుగా బెజవాడ మల్లేశ్వరుడిని దర్శించుకునే వారంటే, ఇక్కడి స్వామికి గల ప్రాచీన వైభవం ... ఈ క్షేత్ర మహాత్మ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.