గాయత్రీ మంత్రంలో దేవతలు

గాయత్రీ మంత్రంలో దేవతలు
సమస్త లోకాలను నడిపించే శక్తి రూపం ... సమస్త పాపాలను హరించే శక్తి స్వరూపం శ్రీ గాయత్రీదేవి. అన్ని వేదాలకు తల్లివంటిది అయిన గాయత్రీదేవి మంత్రానికి మించిన మంత్రం మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. పంచముఖాలతో ... పంచవర్ణాలతో దర్శనమిచ్చే అమ్మవారిని ఆరాధించడం వలన, అనారోగ్యాలు దరిచేరవు. అసలు గాయత్రీ అంటేనే రక్షించునది అనే అర్థం చెప్పబడింది.

ఆ తల్లిని నిత్యం ఆరాధించువారిని ఆమె వెన్నంటి ఉంటూ కాపాడుతూ వుంటుంది. అంతే కాకుండా తనని పూజించేవారి ఇంట సంపదలు ... సంతోషాలు కొలువుండునట్లుగా అనుగ్రహిస్తుంది. అలాంటి గాయత్రీ మంత్రం ( ఓం భూర్భువస్యః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్)లో 24 బీజాక్షారాలు వున్నాయి. ఒక్కో బీజాక్షరం ... ఒక్కో దేవతా శక్తి రూపంగా కొలువైవుంటుంది.

ఈ మంత్రంలో 'తత్' - గణపతి .. , 'స' - నరసింహ స్వామి .., 'వి' - విష్ణువు .., 'తు' - శివుడు .., 'వ' - కృష్ణుడు .., 'రే' - రాధాదేవి .., 'ణి' - లక్ష్మీదేవి .., 'యం' - అగ్నిదేవుడు .., 'భ' - ఇంద్రుడు .., 'ర్గః' - సరస్వతీదేవి .., 'దే' - దుర్గాదేవి .., 'వ' - హనుమంతుడు .., 'స్య' - పృథ్వీదేవి .., 'ధీ' - సూర్యుడు .., 'మ' - రాముడు .., 'హి' - సీతాదేవి .., 'ధి' - చంద్రుడు .., 'యో' - యముడు .., 'యః '- బ్రహ్మ .., 'నః' - వరుణుడు .., 'ప్ర' - నారాయణుడు .., ' 'చో ' - హయగ్రీవుడు .., 'ద' - హంసదేవత .., 'యాత్' - తులసీదేవి కొలువై ఉంటారని చెప్పబడుతోంది.

More Bhakti Articles