ట్రంప్ ఏపీలో ప‌ర్య‌టిస్తే.. ఏఐ క్రియేటివిటీ సూప‌ర్‌.. వీడియో వైరల్!

       
అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏపీని సంద‌ర్శిస్తే ఎలా ఉంటుందో చూపే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో రూపొందించిన‌ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

ఏపీలోని బీచ్‌ల‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి ట్రంప్‌ కొబ్బ‌రి బోండాలు తాగుతూ మాట్లాడుకోవ‌డం, చంద్ర‌బాబు సైకిల్ తొక్కుతుంటే వెనుక ట్రంప్ కూర్చొని ప్ర‌జ‌ల‌కు అభివాదం చేయ‌డం, పూత‌రేకులు తిన‌డం, పిల్లలతో కలిసి స‌ర‌దాగా గోలీల ఆటాడినట్లు ఏఐ వినియోగించి సూప‌ర్బ్‌గా ఎడిట్ చేశారు. 

ఈ వీడియోను 'టీడీపీ ట్రెండ్స్' త‌న 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతాలో షేర్ చేయ‌గా... అది కాస్తా వైర‌ల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన‌ శైలిలో స్పందిస్తున్నారు.  


More Telugu News