నోవాటెల్ లో సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం

  • నోవాటెల్‌లో సీఎం ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం 
  • 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో మొరాయింపు
  • ఓవర్ వెయిట్ వ‌ల్ల‌ ఉండాల్సిన ఎత్తుకంటే కిందికి దిగిన లిఫ్ట్ 
  • అప్ర‌మ‌త్త‌మై లిఫ్టులో నుంచి సీఎంను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకువచ్చిన అధికారులు
ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌మాదం త‌ప్పింది. హైదరాబాద్ నోవాటెల్‌లో సీఎం ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్ప‌డింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో మొరాయించింది. ఓవర్ వెయిట్ కార‌ణంగా ఉండాల్సిన ఎత్తుకంటే లిఫ్ట్ కిందికి దిగింది. 

దీంతో అధికారులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అటు హోటల్ సిబ్బంది, అధికారులు అప్రమత్తమ‌య్యారు. వెంట‌నే లిఫ్ట్ ఓపెన్ చేసి సీఎం రేవంత్‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకువచ్చారు. 

అనంత‌రం సీఎంను అధికారులు వేరే లిఫ్ట్ లో పంపారు. త్రుటిలో ముఖ్య‌మంత్రికి ప్ర‌మాదం త‌ప్ప‌డంతో అక్క‌డ ఉన్న నేత‌లు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 


More Telugu News