తొలిసారి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ రోహిత్ కుమారుడు అహాన్ ఫేస్‌... సో..క్యూట్ అంటున్న నెటిజ‌న్లు!

  
టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కుమారుడు అహాన్ శ‌ర్మ ఫేస్ తొలిసారి బ‌య‌ట‌కు వ‌చ్చింది. సోమ‌వారం విమానాశ్ర‌యంలో త‌ల్లి రితిక కుమారుడిని ఎత్తుకుని వెళుతుండ‌గా ఫొటోగ్రాఫ‌ర్లు ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ వీడియోలు కాస్తా సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో వైర‌ల్‌గా మారాయి. 

దీంతో వీడియో చూసిన హిట్‌మ్యాన్ అభిమానులు, నెటిజ‌న్లు... అచ్చం రోహిత్ శ‌ర్మ లాగే రౌండ్ ఫేస్, బుగ్గ‌లు, క‌ళ్ల‌తో క్యూట్‌గా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలాఉంటే... ఆదివారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)ను ఓడించిన ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) జ‌ట్టు త‌న త‌ర్వాతి మ్యాచ్‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌)తో త‌న‌ హోం గ్రౌండ్ వాంఖ‌డేలో ఆడ‌నుంది. ఎల్లుండి (గురువారం) ఈ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 

ఇక ఇప్ప‌టివ‌ర‌కు ముంబ‌యి 6 మ్యాచ్ లు ఆడి, రెండు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో ఉంది. స‌న్‌రైజ‌ర్స్ కూడా 6 మ్యాచ్ లు ఆడి, రెండు విజ‌యాల‌తో తొమ్మిదో స్థానంలో ఉంది. నెట్ ర‌న్‌రేట్ కార‌ణంగా ఎంఐ (+0.104) కంటే ఎస్ఆర్‌హెచ్ (-1.245) దిగువ‌న నిలిచింది.  




More Telugu News