IIITH Hyderabad: బిర్యానీ గుట్టు విప్పిన ‘ఐఐఐటీహెచ్’ పరిశోధన.. ఏఐ విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడి
- బిర్యానీల మధ్య తేడాలను గుర్తించేందుకు కృత్రిమ మేధ వినియోగం
- హైదరాబాదీ, అంబూర్, కోల్‌కతా సహా పలు రకాల వంట పద్ధతులపై అధ్యయనం
- తయారీ విధానం, మసాలాల వాడకంలోనే అసలు ప్రత్యేకత
- సంప్రదాయ వంటకాల్లోని పోషక విలువలను విశ్లేషించేందుకు సరికొత్త ఏఐ మోడల్స్
దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బిర్యానీ వంటకాల మధ్య ఉండే వైవిధ్యంపై అంతర్జాతీయ సమాచార సాంకేతిక సంస్థ (ఐఐఐటీ హైదరాబాద్) శాస్త్రవేత్తలు ఆసక్తికర పరిశోధన చేశారు. ఒకే రకమైన బియ్యం, మాంసం వాడినప్పటికీ.. ప్రాంతాన్ని బట్టి బిర్యానీ రుచి, ప్రత్యేకత ఎందుకు మారుతుందనే అంశాన్ని కృత్రిమ మేధ (AI) సాయంతో విశ్లేషించారు.
ఐఐఐటీహెచ్ ప్రొఫెసర్ సీవీ జవహర్ నేతృత్వంలోని బృందం ఏడాది పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అంబూర్, ముంబై, దిండిగుల్, డోన్నె, కాశ్మీరి, కోల్‌కతా, హైదరాబాదీ బిర్యానీల తయారీ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించింది. బియ్యం నానబెట్టడం, మాంసం మ్యారినేషన్, మసాలాల మిశ్రమం, వండే పద్ధతుల్లో ఉండే సూక్ష్మ వ్యత్యాసాలే ఆయా బిర్యానీలకు ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నాయని ఈ పరిశోధన తేల్చింది.
‘హౌ డజ్ ఇండియా కుక్ బిర్యానీ’ పేరుతో రూపొందించిన ఈ పరిశోధనా పత్రాన్ని ఇటీవల మాండీలో జరిగిన ఇండియన్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటర్ విజన్ సదస్సులో ప్రదర్శించారు. భారతీయ వంటకాల్లోని సాంస్కృతిక వైవిధ్యం, ఆరోగ్య, పోషక విలువలను శాస్త్రీయంగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం తోడ్పడుతుందని ప్రొఫెసర్ జవహర్ తెలిపారు. భవిష్యత్తులో ఈ విజువల్ లెర్నింగ్ ఏఐ మోడల్స్‌ను ఇతర సంప్రదాయ వంటకాల విశ్లేషణకు కూడా ఉపయోగించే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.