భారతదేశ యువతకు బిల్‌గేట్స్ కీలక సూచన

  • యువత ఎక్కువగా ప్రయాణాలు చేయాలన్న బిల్‌గేట్స్
  • పేదలు నివసించే ప్రదేశాలను ఒకసారి పరిశీలించాలని సూచన
  • భారతీయులు గొప్ప ప్రతిభావంతులన్న బిల్‌గేట్స్
భారతీయ యువతకు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక సూచనలు చేశారు. యువత ఎక్కువగా పర్యటనలు చేయాలని, పేదలు నివసించే ప్రాంతాలను ఒకసారి సందర్శించాలని కోరారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

పేదలు నివసించే ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎంతో తెలివైన వారని, కానీ వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయని అన్నారు. వారికి సరైన విద్య అందడం లేదని, ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయని తెలిపారు. వీటిని యువత గమనించాలని సూచించారు. 

ప్రపంచంలోనే భారత్ టాలెంట్ హబ్‌గా ఎందుకు మారుతోందని ఎదురైన ప్రశ్నపై బిల్‌గేట్స్ స్పందిస్తూ, భారతీయులు గొప్ప ప్రతిభావంతులని, సమస్యలను సులభంగా పరిష్కరిస్తారని అన్నారు. వారి ఆవిష్కరణలు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు.

డిజిటల్ రంగంలోనూ భారత్ శరవేగంగా దూసుకెళుతోందని, ఆధార్ వంటి సంబంధిత కార్యక్రమాలు ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. 


More Telugu News