Ahmed Sheikh: అయోధ్యలో కలకలం... రామాలయం ప్రాంగణంలో నమాజ్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి

Ahmed Sheikh Attempts Namaz at Ayodhya Ram Temple Complex
  • అదుపులోకి తీసుకున్న అయోధ్య రామాలయ భద్రతా సిబ్బంది
  • షోపియాన్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల అహ్మద్ షేక్‌గా గుర్తింపు
  • అహ్మద్ షేక్‌ను విచారిస్తున్న పోలీసులు
అయోధ్యలోని రామమందిర సముదాయంలో నమాజ్ చేయడానికి ప్రయత్నించిన కశ్మీర్‌కు చెందిన వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. భద్రతా సిబ్బంది తన వద్దకు రాగానే అతను పెద్ద ఎత్తున నినాదాలు చేశాడు. అతడిని కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల అహ్మద్ షేక్‌గా గుర్తించారు. కశ్మీర్ సంప్రదాయ దుస్తులు ధరించిన అతను గేట్ డీ1 ద్వారా ఆలయంలోకి ప్రవేశించాడు.

అత్యంత భద్రత కలిగిన రామాలయ సముదాయంలోకి ప్రవేశించి, మందిరాన్ని సందర్శించి, అనంతరం సీతారసోయి ప్రాంతం సమీపంలో కూర్చుని నమాజ్ చేయడానికి సిద్ధమయ్యాడని అధికారులు వెల్లడించారు. ఆలయ భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని స్థానిక పోలీసులకు విచారణ నిమిత్తం అప్పగించారు.

అహ్మద్ షేక్‌ను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయోధ్య రామాలయాన్ని సందర్శించడం వెనుక అతడి ఉద్దేశం, అలాగే ఈ సంఘటనతో ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అతని నుంచి పోలీసులు డ్రైఫ్రూట్స్ స్వాధీనం చేసుకున్నారు.
Ahmed Sheikh
Ayodhya
Ram Mandir
Namaz
Kashmir
Security Breach
Poshian District
Uttar Pradesh

More Telugu News