ఏపీ స‌చివాల‌యంలో అగ్ని ప్ర‌మాదం

  • సచివాలయంలోని రెండో బ్లాక్‌లో అగ్ని ప్ర‌మాదం
  • బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో చెల‌రేగిన మంట‌లు
  • వెంట‌నే ప్ర‌మాదాస్థ‌లికి చేరుకుని మంటలను ఆర్పివేసిన అగ్నిమాప‌క సిబ్బంది
ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం ఉద‌యం అగ్నిప్రమాదం జ‌రిగింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా స‌మాచారం. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క‌ సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లి వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
కాగా, సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టూరిజం మంత్రి కందుల దుర్గేశ్‌, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయాలు ఉన్నాయి. 


More Telugu News