Indian Railways: ప్రయాణికుల ఛార్జీల నిర్ణయం వ్యాపార రహస్యం.. వెల్లడించలేం: రైల్వే బోర్డు

Indian Railways says passenger fare determination is a trade secret
  • ఆర్టీఐలోని సెక్షన్ 8 ప్రకారం వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదన్న బోర్డు
  • టిక్కెట్ ధరల నిర్ణయం, తత్కాల్ టిక్కెట్ల ప్రభావంపై వచ్చిన దరఖాస్తుకు సమాధానం
  • రైల్వే బోర్డు సమాధానాన్ని ఆమోదిస్తూ దరఖాస్తును కొట్టివేసిన సీఐసీ
ప్రయాణికుల రైలు ఛార్జీలను నిర్ణయించే పద్ధతి ఒక వ్యాపార రహస్యమని, దానిని వెల్లడించాల్సిన అవసరం లేదని కేంద్ర సమాచార కమిషన్‌కి ఇండియన్ రైల్వే స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)లోని సెక్షన్ 8 ప్రకారం ఈ వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని తెలిపింది.

రైలు టిక్కెట్ ధరలను నిర్ణయించే పద్ధతి, డిమాండ్‌ను బట్టి టిక్కెట్ ధరలు పెంచడం లేదా తగ్గించడం, తత్కాల్ టిక్కెట్ల ప్రభావం గురించి సమాచారం కోరుతూ ఒక దరఖాస్తు రాగా, దీనిపై రైల్వే బోర్డు స్పందించింది. రైల్వే బోర్డు ఇచ్చిన సమాధానాన్ని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆమోదిస్తూ దరఖాస్తును కొట్టివేసింది.

రైళ్లలో వివిధ తరగతులు, వాటిలోని సౌకర్యాల ఆధారంగా టిక్కెట్ ధరలను నిర్ణయిస్తామని సీఐసీకి రైల్వే బోర్డు వివరించింది. రైల్వే శాఖ వ్యాపార ప్రాతిపదికన రైళ్లను నడుపుతున్నప్పటికీ, వచ్చే లాభాలను ప్రైవేటు కంపెనీల మాదిరిగా తన వద్ద ఉంచుకోదని తెలిపింది. ఆ లాభాలను సామాన్యుడికి ప్రయోజనం కలిగించేందుకు తిరిగి వెచ్చిస్తామని వెల్లడించింది. రైల్వే టిక్కెట్ ధరలను నిర్ణయించే పద్ధతిని వెల్లడించాల్సిన అవసరం లేదని సీఐసీ గతంలో కూడా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది.
Indian Railways
Railways
Train tickets
Ticket prices
RTI Act
Central Information Commission

More Telugu News