ఆకలేస్తే చిరంజీవి గారి ఇంటికెళ్లి భోజనం చేసేవాడిని: నాజర్ భావోద్వేగం

Entertainment
Advertisement
  • కెరీర్ తొలినాళ్ల కష్టాలను గుర్తుచేసుకున్న సీనియర్ నటుడు నాజర్
  • ఆకలేసిన రోజుల్లో చిరంజీవి ఇంట్లో భోజనం పెట్టారన్న నటుడు
  • నటన నేర్చుకునేందుకు చెన్నైలో అదనపు పనులు చేశానని వ్యాఖ్య
  • 'చంటి' షూటింగ్ సమయంలో హీరో వెంకటేష్ ఎంతో సాయం చేశారన్న నాజర్
సినీ పరిశ్రమలో విలక్షణ నటనతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు నాజర్, తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ముందు, ఆ తర్వాత అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో ఎన్నో ఆకలి రోజులను చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్లిష్ట సమయంలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తనకు అందించిన మద్దతును ఆయన ఎంతో భావోద్వేగంతో పంచుకున్నారు.

అవకాశాల కోసం చెన్నైలో ఎదురుచూస్తున్న రోజుల్లో భోజనానికి కూడా ఇబ్బంది పడిన సందర్భాలు ఎదురయ్యాయని నాజర్‌ వెల్లడించారు. అలాంటి సమయాల్లో తాను చిరంజీవి ఇంటికి వెళ్లి భోజనం చేసేవాడ్నని తెలిపారు. అప్పట్లో చిరంజీవి వరుస షూటింగులతో బిజీగా ఉండేవారని, తన స్నేహితుడి ద్వారా చిరంజీవి అర్ధాంగి సురేఖను సంప్రదించి, ఇంట్లో భోజనం ఉందో లేదో తెలుసుకునేవాడ్నని వివరించారు. భోజనం అందుబాటులో ఉందని తెలియగానే అక్కడికి వెళ్లి తిని వచ్చేవాడ్నని చెప్పారు. ఒక్కోసారి తాను వెళ్లి భోజనం చేసి వచ్చిన విషయం చిరంజీవికి తెలిసేది కాదని, ఆయన షూటింగులో ఎక్కడో ఉండేవారని తెలిపారు. వారి కుటుంబం తనకు చేసిన ఆ సాయం వెలకట్టలేనిదని నాజర్ పేర్కొన్నారు.

నటన వైపు అడుగులు వేయడంలో తన తండ్రి ప్రోత్సాహం ఎంతో ఉందని నాజర్ తెలిపారు. తనలోని ప్రతిభను గుర్తించి సినీ రంగంలోకి వెళ్లమని తండ్రే సూచించారని చెప్పారు. ఆ తర్వాత చెన్నై చేరుకుని ఓ చిన్న ఉద్యోగంలో చేరారు. యాక్టింగ్ స్కూల్ ఫీజు చెల్లించే స్తోమత లేకపోవడంతో, ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత అదనంగా చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు ఆదా చేసుకున్నారు. చిత్రపరిశ్రమలో ఒక నటుడిగా నిలదొక్కుకోవడానికి తనకు దాదాపు 15 ఏళ్ల సమయం పట్టిందని ఆయన వివరించారు.

ఇక తెలుగు చిత్రపరిశ్రమలో తన అరంగేట్రం గురించి మాట్లాడుతూ.. వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన ‘చంటి’ సినిమాతో తాను టాలీవుడ్‌కు పరిచయమయ్యానని తెలిపారు. ఆ సమయంలో తనకు తెలుగు భాష అస్సలు రాదని, కానీ స్టార్ హీరో అయినప్పటికీ వెంకటేశ్ ఎంతో ఓపికగా ప్రతి డైలాగ్‌ను వివరించి, పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకునేలా ప్రోత్సహించారని చెప్పారు.

కష్టకాలంలో చిరంజీవి, సురేఖ చూపిన దాతృత్వం.. అలాగే వెంకటేశ్ అందించిన సహకారం తన సినీ ప్రయాణంలో ఎప్పటికీ మరచిపోలేనివని నాజర్ కృతజ్ఞతతో స్మరించుకున్నారు. ఎటువంటి గుర్తింపును ఆశించకుండా నిస్వార్థంగా చేసే సాయమే అత్యంత గొప్పదని ఆయన అన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

NassarChiranjeeviNassar Career StrugglesVenkateshChanti MovieTelugu Cinema

More Telugu News

తల్లి అంత్యక్రియలకు డబ్బుల్లేని స్థితిలో ఆదుకున్న భార్య.. ధన్‌రాజ్ జీవితంలో విషాదం

19 Nov, 23:41

కూతురు ఐశ్వర్యపై దుష్ప్రచారం.. చట్టపరమైన చర్యలు తప్పవన్న అర్జున్

19 Nov, 23:29

ఎంపీపీ ఎన్నికలపై ఎస్ఈసీ ప్రకటన.. మిగిలిన 58 మండలాల్లో రేపు ఎన్నికలు

19 Nov, 23:22

చంద్రబాబుకు శుభలేఖ ఇవ్వడంలో తప్పేముంది? షర్మిలకు అండగా విజయమ్మ బహిరంగ లేఖ!

19 Nov, 23:00

జైపూర్‌లో వైద్యుల అద్భుతం.. పుట్టిన 17 గంటలకే పసికందుకు పేస్‌మేకర్

19 Nov, 22:47

బంగారంలో రేడియం, రీనియం కల్తీ ప్రచారాలపై ఆందోళన వద్దు: జ్యువెలర్స్ అసోసియేషన్

19 Nov, 22:34

తన పార్టీ ఆఫీసు గూగుల్ లొకేషన్ షేర్ చేసిన విజయసాయిరెడ్డి

19 Nov, 22:28

అనిరుధ్-కావ్యా లేటెస్ట్ ఫొటోలు.. చేతిలో చెయ్యేసి ర్యాంప్ వాక్!

19 Nov, 22:19

మన రోజువారీ ఆహారంలో ఫైబర్ ఎందుకు ఉండాలంటే..!

19 Nov, 22:10

జనసేన ఆఫీస్ కేంద్రంగా జాబ్ స్కామ్ జరిగిందన్న వైసీపీ.. సీబీఐ విచారణకు డిమాండ్

19 Nov, 22:00

భారత విమానాలపై గగనతల నిషేధాన్ని డిసెంబర్ 24 వరకు పొడిగించిన పాకిస్థాన్

19 Nov, 21:48

జనసేన పార్టీలో చేరిన లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు

19 Nov, 21:11

అనిరుధ్ పై ఓ రేంజిలో పొగడ్తల వర్షం కురిపించిన అల్లు అర్జున్

19 Nov, 20:56

ఏపీలో 5 ఎంపీపీ స్థానాల్లో లాటరీ... టీడీపీకి 4, వైసీపీకి 1

19 Nov, 20:48
..More Telugu News