చికిత్స పేరుతో పిలిపించి చితక్కొట్టారు.. యువ వైద్యుడిని ట్రాప్ చేసిన మలయాళ నటి!
Advertisement
- డాక్టర్‌పై దాడి కేసులో మలయాళ నటి అతుల్య చంద్ర అరెస్ట్
- చికిత్స పేరుతో నమ్మించి ఫ్లాట్‌కు పిలిపించిన వైనం
- ఫ్లాట్‌లో బంధించి దాడి, రూ. 3 లక్షల విలువైన ఫోన్లు లూటీ
- మొత్తం 12 మంది నిందితులు, ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఆర్థిక వివాదాలే కారణమా అనే కోణంలో దర్యాప్తు
Advertisement
కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువ వైద్యుడిని ఫ్లాట్‌కు పిలిపించి, దాడి చేసి, దోపిడీకి పాల్పడిన కేసులో మలయాళ నటి అతుల్య చంద్రను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 12 మందిని నిందితులుగా చేర్చగా, పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. నటి అతుల్య, బాధితుడైన డాక్టర్ ముందునుంచే స్నేహితులు. ఈ పరిచయంతోనే నవంబర్ 2న అతుల్య ఆ డాక్టర్‌కు ఫోన్ చేసింది. తన పిన్నికి తీవ్ర అనారోగ్యంగా ఉందని, అత్యవసరంగా ఫ్లాట్‌కు వచ్చి చికిత్స అందించాలని కోరింది. స్నేహితురాలే కావడంతో ఆమె మాటలను నమ్మిన డాక్టర్, సాయంత్రం 6:30 గంటల సమయంలో ఆమె చెప్పిన అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు.
అయితే, ఫ్లాట్‌లోకి అడుగుపెట్టిన డాక్టర్‌కు షాక్ తగిలింది. అక్కడ రోగికి బదులుగా అతుల్యతో సహా ఓ ముఠా ఎదురుచూస్తోంది. లోపలికి రాగానే అతడిని బయటకు వెళ్లకుండా అడ్డుకుని బెదిరించారు. నిందితుల్లో ఒకరైన బిబిన్ అనే వ్యక్తి డాక్టర్ ముఖంపై బలంగా కొట్టాడు. ఆ తర్వాత మిగతా వారు కూడా అతడిని కుర్చీలో కూర్చోబెట్టి విచక్షణారహితంగా దాడి చేశారు.
దాడి అనంతరం, నిందితులు డాక్టర్ వద్ద ఉన్న రూ. 3 లక్షల విలువైన మొబైల్ ఫోన్లతో పాటు ఇతర వస్తువులను దోచుకున్నారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు వెంటనే కడవంత్రా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి అతుల్య చంద్ర సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆర్థిక వివాదాలు లేదా వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ దాడి జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.