ఏపీ పురపోరు.. క్లీన్ స్వీప్ దిశగా కూటమి.. లేటెస్ట్ ట్రెండ్స్ ఇవిగో!
Advertisement
- పురపోరులో కూటమి పార్టీల జోరు
- 13 కార్పొరేషన్లలో 12 చోట్ల కూటమి ఆధిక్యం
- 87 మున్సిపాలిటీల్లో 60 కైవసం
Advertisement
ఆంధ్రప్రదేశ్ పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. మంగళవారం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో దాదాపు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కూటమి అభ్యర్థులు విజయపథంలో దూసుకెళుతున్నారు. ఈ ఫలితాలు వైసీపీకి కోలుకోలేని దెబ్బగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలు దాదాపు ఏకపక్షంగా వెలువడుతున్నాయి. ఈ సాయంత్రానికి కూటమి 13 కార్పొరేషన్లలో 12 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. 87 మున్సిపాలిటీల్లో 60 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది.
ప్రధాన నగరపాలక సంస్థలైన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కడప, మచిలీపట్నంలలో కూటమి మేయర్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఇప్పటికే తిరుపతి మేయర్ అభ్యర్థిగా టీడీపీకి చెందిన మన్నెం శ్రీనివాస ప్రసాద్, చిత్తూరులో కఠారి హేమలత, గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గెలుపు ఖాయమైంది. విశాఖ మేయర్ స్థానంలో టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి 2 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మున్సిపాలిటీల విషయానికొస్తే కూటమి జోరుకు అడ్డుకట్టే లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో అతిపెద్ద సంచలనం ఏమిటంటే, వైసీపీ అధినేత సొంత నియోజకవర్గమైన పులివెందుల మున్సిపాలిటీని సైతం టీడీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులు నర్సీపట్నం, పాలకొండ, జగ్గయ్యపేట, తాడిపత్రి, ప్రొద్దుటూరు, పుంగనూరు, పలమనేరు వంటి కీలక మున్సిపాలిటీలలో విజయం సాధించారు. మిత్రపక్షాలైన జనసేన తెనాలి, నర్సాపురం, సామర్లకోట, మడకశిరలలో, బీజేపీ గూడూరు, యర్రగుంట్ల, ఎలమంచిలిలలో గెలుపొందాయి.
వెలువడిన ఫలితాల ప్రకారం, వైసీపీ కేవలం నందికొట్కూరు మున్సిపాలిటీలో మాత్రమే విజయం సాధించి నామమాత్రంగా మిగిలింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఫలితాల సరళి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ గెలుపు పట్టణ ప్రాంతాల్లో అధికార కూటమికి ఉన్న బలమైన ప్రజామోదాన్ని స్పష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.