షరతులు లేకుండా క్షమాపణ చెప్పాల్సిందే: నటుడు ఇమ్రాన్‌పై హైకోర్టు ఆగ్రహం

Entertainment
Advertisement
  • సీజేపీ నిరసనలలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్
  • ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించవద్దన్న బాంబే హైకోర్టు
  • భారతీయులైతే విదేశాల్లో మరుసటి ఫ్లైట్‌కే వెనక్కి పంపేవారన్న న్యాయస్థానం
Advertisement
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌పై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెలలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు అధికారులు తనకు జారీ చేసిన 'లీవ్ ఇండియా' నోటీసును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేవలం అఫిడవిట్ దాఖలు చేస్తే సరిపోదని, షరతులు లేకుండా క్షమాపణ చెప్పాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా, "ఒకవేళ భారత పౌరులు విదేశాల్లో ఇలాంటి చర్యకు పాల్పడితే, మరుసటి ఫ్లైట్‌కే వారిని భారత్‌కు పంపించేవారు" అని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. "ఇన్ని సంవత్సరాలుగా భారత్‌లో నివసిస్తున్న మీరు ఎప్పుడూ నిరసనల్లో పాల్గొనలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు పాల్గొన్నారు?" అని ఇమ్రాన్‌ను ప్రశ్నించింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) నిబంధనలను ఉల్లంఘించవద్దని హెచ్చరించింది.

ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) తరఫున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ, ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని, ఓసీఐ కార్డు హోల్డర్‌గా ఆయన హక్కులు పరిమితమని తెలిపారు. భారత పౌరులతో సమానంగా నిరసనల్లో పాల్గొనే హక్కు ఆయనకు లేదని వాదించారు. "ఇమ్రాన్‌కు ప్రజల్లో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. నిరసన ఉద్దేశం తెలిసి కూడా ఆయన అందులో పాల్గొన్నారు" అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, నిరసన నిర్వాహకులతో అతడికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ భారత్ లోనే ఉండేందుకు అనుమతించాలని కోరుతూ, ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేస్తామని ప్రతిపాదించారు. అయితే, కోర్టు మాత్రం క్షమాపణకే మొగ్గు చూపాలని సూచించింది.
Advertisement

సంబంధిత వార్తలు

Imran KhanBombay High CourtLeave India noticeOCI card holderBollywood actorFRRO

More Telugu News

ఏపీ తీరం వైపు 'మురసు'.. పోర్టుల్లో పెను ప్రమాద హెచ్చరికలు.. దక్షిణ కోస్తాలో రెడ్ అలర్ట్

02 Nov, 18:24

'మురసు' తుపాను ప్రభావం: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ముందస్తు చర్యలు

02 Nov, 18:08

ఏపీ రెండు రకాల వైపరీత్యాలతో సతమతమవుతోంది.. తక్షణమే సాయం అందించండి: కేంద్రబృందంతో చంద్రబాబు

02 Nov, 17:57

2008 నాటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు ఐపీఎల్ క్యాలెండర్ మార్చాలి: లలిత్ మోదీ

02 Nov, 17:43

తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి: అమిత్‌ షా

02 Nov, 17:32

త్రివర్ణ పతాకం చేతబూని హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర.. కదంతొక్కిన కాషాయ శ్రేణులు

02 Nov, 17:30

ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లిపై వివాదం.. ఇస్లాంకు విరుద్ధమన్న మత పెద్దలు

02 Nov, 17:14

హైదరాబాద్‌ మెట్రోకు నిధుల జోరు.. ఫేజ్‌-2కు రూ.150 కోట్లు

02 Nov, 17:00

ప్రతి మండలంలో కూటమి జెండాలు రెపరెపలాడాలి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు దిశానిర్దేశం

02 Nov, 16:53

మురసు తుపాను ఎఫెక్ట్: ఏపీలో పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

02 Nov, 16:45

రిలయన్స్‌ దూకుడుతో మార్కెట్ల పరుగులు.. 1,233 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

02 Nov, 16:39

అసలు వీటిని ఎన్నికలంటారా?: రవీంద్రనాథ్ రెడ్డి

02 Nov, 16:35

దిగ్గజ జట్లకు షాక్.. వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్‌ సంచలనం

02 Nov, 16:17

రీపోలింగ్ అన్ని కేంద్రాల్లో నిర్వహించాలి: షర్మిల డిమాండ్

02 Nov, 16:14
..More Telugu News