Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే

Gold price slight decrease check rates in major cities
Advertisement
  • తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,42,470
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,30,590
  • హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,19,900
Advertisement
బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ, భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో శనివారం ఉదయం కూడా పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,470గా ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,30,590 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,06,850గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతుండగా, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ధరలు స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,620 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,30,740గా ఉంది.

మరోవైపు వెండి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండిపై రూ.100 తగ్గి, ప్రస్తుతం రూ.2,19,900 వద్ద ట్రేడ్ అవుతోంది.

అయితే, బంగారం, వెండి ధరలు రోజంతా ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అందువల్ల, కొనుగోలుదారులు లావాదేవీలు జరిపే ముందు స్థానిక నగల వ్యాపారులను సంప్రదించి తాజా ధరలను నిర్ధారించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Advertisement
Gold Price
Gold Rates Today
Silver Price Hyderabad
24 Carat Gold Rate
22 Carat Gold Rate
Gold Rate in India

More Telugu News