టీవీల్లో డిబేట్లు.. ఛానెళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు!
Advertisement
- నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న కేంద్రం
- ఏఐని సహాయక సాధనంగా మాత్రమే వాడాలని సూచన
- వార్తల కచ్చితత్వం, విశ్వసనీయత కాపాడాలని స్పష్టీకరణ
- చర్చల్లో అభ్యంతరకర వ్యాఖ్యలకు తావివ్వొద్దని సూచన
- ప్యానెలిస్టుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సలహా
Advertisement
టీవీ ఛానళ్లు వార్తలు, కార్యక్రమాల ప్రసారంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వార్తల్లో వాస్తవాలు వక్రీకరించినా, నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
వార్తలు, గ్రాఫిక్స్, వర్చువల్ న్యూస్ ప్రెజెంటేషన్లలో ఏఐని సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగించాలని తెలిపింది. దాని వల్ల వార్తల కచ్చితత్వం, విశ్వసనీయత దెబ్బతినకూడదని పేర్కొంది.
కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్టం-1995, నిబంధనలు-1994 ప్రకారం నిర్దేశించిన ప్రోగ్రామ్ కోడ్ను కొన్ని ఛానళ్లు ఉల్లంఘించినట్లు మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రసారాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వివిధ ఛానళ్లలో ఒకే తరహా వార్తలు, దృశ్యాలు ప్రసారమవుతున్న తీరుపై అంతర్శాఖల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. టీవీ కార్యక్రమాల్లో అభ్యంతరకర భాష, అనుచిత ప్రవర్తనను సాధారణ విషయాలుగా చూపకూడదని సూచించింది.
చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే ప్యానెలిస్టుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం తెలిపింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే, ఉద్రిక్తతలు పెంచే వ్యాఖ్యలకు తావివ్వకూడదని స్పష్టం చేసింది. అవసరమైతే అలాంటి వ్యాఖ్యలను మ్యూట్ చేయడం, హెచ్చరికలు ఇవ్వడం, డిస్క్లెయిమర్లు చూపడం లేదా ప్రసారాన్ని నిలిపివేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది.