మంగళగిరిలో వైసీపీకి షాక్.. లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన కీలక నేత
Advertisement
- మంగళగిరిలో టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు
- మంత్రి లోకేశ్ సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ నేత రజనీకాంత్
- స్థానిక ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలవాలని పిలుపు
- మంగళగిరిలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న లోకేశ్
- రజనీకాంత్‌తో పాటు టీడీపీ తీర్థం పుచ్చుకున్న 25 కుటుంబాలు
Advertisement
మంగళగిరి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, గుంటూరు పార్లమెంట్ వైసీపీ ఉపాధ్యక్షుడు వడ్డేశ్వరపు రజనీకాంత్ తన మద్దతుదారులతో కలిసి టీడీపీలో చేరారు. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆయనకు, మరో 25 కుటుంబాలకు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. "2024 సార్వత్రిక ఎన్నికల కంటే స్థానిక ఎన్నికల్లోనే ఎక్కువ మెజార్టీ సాధించాలి. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఎన్డీయే పక్షాన నిలబడటమే మనకు శ్రీరామరక్ష. అప్పుడే మనం అనుకున్న అభివృద్ధి సాధ్యమవుతుంది" అని ఆయన స్పష్టం చేశారు.
గత పదేళ్ల పాలనను, తన రెండున్నరేళ్ల పనితీరును బేరీజు వేసుకుని ప్రజలు ఓటు వేయాలని లోకేశ్ కోరారు. మంగళగిరి నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ, ఆసుపత్రి, కమ్యూనిటీ భవనాలు, పార్కులు వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఈ అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అహర్నిశలు పనిచేస్తానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మాజీ ఎంపీపీ అయిన రజనీకాంత్‌తో పాటు, చిలువూరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోటకూర సీతారామయ్య, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ యాళ్ల జయలక్ష్మీ, ఇతర టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.