Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్‌ ఒక క్రిమినల్ లిటిగెంట్: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

Chandrababu Naidu calls Jagan Mohan Reddy a criminal litigant
Advertisement
  • పిటిషన్లతో ఎన్నికలు, అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందని ఆరోపణ
  • జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకోవాలని నేతలకు సూచన
  • క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపు
Advertisement
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులు, బూత్ స్థాయి కార్యకర్తలతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో జగన్ లాంటి 'క్రిమినల్ లిటిగెంట్లు' ఉండటం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

తానే విధ్వంసానికి పాల్పడి, తానే కోర్టుకు వెళ్లే వికృత ఆలోచనలు జగన్‌కే వస్తాయని చంద్రబాబు అన్నారు. వైసీపీని 'గొడ్డలి పార్టీ'గా అభివర్ణిస్తూ, అభివృద్ధిని, ఎన్నికలను అడ్డుకోవడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. కేవలం స్థానిక ఎన్నికలనే కాకుండా, మెగా డీఎస్సీ, అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు వందల సంఖ్యలో పిటిషన్లు వేశారని ఆరోపించారు. ఓటరు జాబితా, బీసీ రిజర్వేషన్లపైనా కోర్టులకు వెళ్లి ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్నారని గుర్తుచేశారు.

స్థానిక ఎన్నికల్లో జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుంటూ కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాము మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తుంటే, వైసీపీ మాత్రం విధ్వంసకారులను బరిలోకి దించుతోందని ఆరోపించారు. బెంగళూరులో కూర్చొని జగన్ విధ్వంస రచనలు చేస్తున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి గుండాలను దించేందుకు కుట్రలు పన్నుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచారానికి వారం రోజులే సమయం ఉందని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూనే, వైసీపీ అరాచకాలను, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు. వికృత మనస్తత్వం ఉన్నవారిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy
AP Local Body Elections
TDP Janasena BJP Alliance

More Telugu News