సుప్రీం ఆదేశాలు మాకు బూస్ట్ ఇచ్చాయి: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Advertisement
- 19 మున్సిపాలిటీల్లో గెలుస్తామన్న పెద్దిరెడ్డి
- నామినేషన్ల ప్రక్రియలో తమ అభ్యర్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపణ
- మిథున్ రెడ్డిపై ఐదు కేసులు పెట్టారని మండిపాటు
Advertisement
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తమ పార్టీకి ఎంతో బూస్ట్ ఇచ్చాయని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ తీర్పు నేపథ్యంలో 19 మున్సిపాలిటీలలో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసి గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ... నామినేషన్ల ప్రక్రియలో వైసీపీ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. తమ వారిని నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, గందరగోళం సృష్టించడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని అన్నారు. అదే సమయంలో టీడీపీ నేతలు సులభంగా నామినేషన్లు వేసేందుకు పోలీసులు సహకరించారని విమర్శించారు.
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి, నోటీసులు జారీ చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డిని ఐదు కేసుల్లో ఏ-1గా చేర్చారని ఆయన తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కేసులు పెట్టినా తమ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు జోక్యంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని, ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించి, అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.