తిరుమలలో వైభవోపేతంగా చక్రస్నానం.. ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Advertisement
- వేడుకగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
- పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం
- వేలాదిగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
- లోకక్షేమం కోసం అవభృథ స్నానం నిర్వహణ
- అంతకుముందు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పకు స్నపన తిరుమంజనం
Advertisement
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం జరిగిన చక్రస్నానంతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రత్తాళ్వార్లకు అర్చకులు పవిత్ర స్నానం చేయించగా, అదే సమయంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఈ పవిత్ర ఘట్టంతో తొమ్మిది రోజుల పాటు కన్నుల పండువగా జరిగిన ఉత్సవాలు ముగిశాయి.
చక్రస్నానానికి ముందుగా, శ్రీ భూవరాహస్వామి ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి, సుదర్శన చక్రత్తాళ్వార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధం వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ పవిత్ర క్రతువు సందర్భంగా టీటీడీ వేదపారాయణదారులు పురుషసూక్తం, శ్రీసూక్తం, ఉపనిషత్తు మంత్రాలను పఠించారు. అనంతరం తిరుమల పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వాములు పాశురాలను గానం చేశారు. స్వామి, అమ్మవార్లను విశిష్ట పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు.
తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలకు చక్రస్నానం సంపూర్ణతను ఇస్తుంది. లోకం సుభిక్షంగా ఉండాలని, సకల జీవరాశులు శ్రేయస్సుతో వర్ధిల్లాలని కోరుతూ ఈ అవభృథ స్నానాన్ని నిర్వహిస్తారు. మహాయజ్ఞం ముగింపులో చేసే అవభృథ స్నానం వలె, బ్రహ్మోత్సవ యజ్ఞ ఫలం దక్కాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తారు. సుదర్శన చక్రం స్పృశించడం ద్వారా పుష్కరిణి జలాలు మరింత పవిత్రమవుతాయని, ఆ సమయంలో స్నానం ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మి, నరేశ్ కుమార్, జేఈవో గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.