సూపర్‌స్టార్‌పై అభిమానం.. 'జైలర్ 2' కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజూ శాంసన్
- భార్య, స్నేహితులతో కలిసి సినిమా వీక్షించిన భారత క్రికెటర్
- ఢిల్లీ పనుల వల్ల రిలీజ్ రోజు చూడలేకపోయానని వెల్లడి
- ఈ ప్రదర్శనకు జట్టులోని తమిళ సహాయక సిబ్బంది కూడా హాజరు
టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'జైలర్ 2'ను చూసేందుకు సంజూ ఏకంగా ఒక థియేటర్‌నే పూర్తిగా బుక్ చేశాడు. తన భార్య, స్నేహితులతో కలిసి ఈ సినిమాను వీక్షించి సందడి చేశాడు.
ఈ సందర్భంగా సంజూ శాంసన్ మాట్లాడుతూ.. తాను ఎప్పటినుంచో రజనీకాంత్‌కు పెద్ద అభిమానినని తెలిపాడు. "ఢిల్లీలో ఒక కార్యక్రమం ఉండటం వల్ల సినిమా విడుదల రోజున చూడలేకపోయాను. అందుకే ఇప్పుడు నా స్నేహితులను, భార్యను ఆహ్వానించాను. రజనీ సర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడటం చాలా ఉత్సాహంగా ఉంది" అని అన్నాడు.
ఈ ప్రత్యేక ప్రదర్శనకు భారత జట్టులోని తమిళం మాట్లాడే సహాయక సిబ్బంది కూడా హాజరైనట్లు సంజూ శాంసన్ పేర్కొన్నాడు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్ 2' ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ వసూళ్లతో రికార్డులు కొల్లగోడుతోంది. ప్రస్తుతం సంజూ శాంసన్ తన అభిమాన నటుడి సినిమా కోసం థియేటర్ బుక్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.