Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించిన కవిత.. ప్రభుత్వానికి హెచ్చరిక

Kavitha visits Kannepalli Pump House and warns the government
Advertisement
  • నవంబర్ చివరికల్లా కాఫర్‌డ్యామ్‌ నిర్మించాలని కవిత డిమాండ్
  • లేదంటే పంప్‌హౌస్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరిక
  • మేడిగడ్డను చూపి రైతులను నష్టపరచవద్దని ప్రభుత్వానికి సూచన
Advertisement
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నవంబర్ నెలాఖరు నాటికి ప్రాణహిత నీటిని మళ్లించేందుకు వెంటనే కాఫర్‌డ్యామ్‌ను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో కన్నెపల్లి పంప్‌హౌస్ వద్దే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

కరవు పరిస్థితుల్లోనూ అందుబాటులో ఉన్న నీటిని రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. మేడిగడ్డను ఒక భూతంగా చూపి రైతులను నష్టపరచవద్దని ప్రభుత్వానికి సూచించారు. తమ పార్టీ కేవలం విమర్శించడానికే పరిమితం కాలేదని, ప్రభుత్వానికి పరిష్కార మార్గాలు కూడా సూచిస్తోందని తెలిపారు. 

టీవీల్లో కనిపించడం కోసం కాకుండా, ప్రజల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలనే ఉద్దేశంతోనే తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ సూచనలను సీరియస్‌గా తీసుకుని రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement
Kalvakuntla Kavitha
Kannepalli Pump House
Kaleshwaram Project
Telangana Government
Medigadda Barrage
Telangana Farmers Issues

More Telugu News