Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎమ్మెల్సీ ఎన్నికలు: బీజేపీ అభ్యర్థిగా పీఆర్‌టీయూ నేత భిక్షం గౌడ్ పేరు దాదాపు ఖరారు

Bhiksham Goud almost finalized as BJP candidate for MLC elections
Advertisement
  • ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థి దాదాపు ఖరారు
  • పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పింగళి భిక్షం గౌడ్‌ వైపే పార్టీ మొగ్గు
  • ఉపాధ్యాయులు, పట్టభద్రుల్లో పీఆర్‌టీయూ నెట్‌వర్క్‌పై బీజేపీ ఆశలు
Advertisement
తెలంగాణలో జరగనున్న ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి బీజేపీ తన అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పింగళి భిక్షం గౌడ్‌ను బరిలోకి దించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. 

విశ్వసనీయ వర్గాల ప్రకారం, ఇటీవల పీఆర్‌టీయూ సీనియర్ నేతలు ఢిల్లీతో పాటు రాష్ట్రస్థాయిలోని బీజేపీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ఈ నెలాఖరులో ప్రభుత్వ సర్వీస్ నుంచి పదవీ విరమణ చేయనున్న భిక్షం గౌడ్, ఆ తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు.

ఉపాధ్యాయులు, పట్టభద్రుల్లో పీఆర్‌టీయూకు ఉన్న బలమైన నెట్‌వర్క్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ స్థానంలో గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. భిక్షం గౌడ్‌తో పాటు మరికొందరి పేర్లను కూడా పార్టీ పరిశీలించినప్పటికీ, ఆయన వైపే అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన ఎమ్మెల్సీ స్థానాలకు కూడా అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న బీజేపీ, త్వరలోనే అధికారికంగా పేర్లను ప్రకటించనుంది.
Advertisement
Advertisement
Pingali Bhiksham Goud
BJP Telangana
Graduates MLC Elections
Khammam Warangal Nalgonda MLC
PRTU leader
Telangana Politics

More Telugu News