నారా లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ.. మున్సిపల్ ఎన్నికలపై విపక్షాలకు లోకేశ్ చురకలు
Advertisement
- ఉండవల్లిలో మంత్రి లోకేశ్‌ను కలిసిన మిజోరం సీఎం లాల్దుహోమా
- పురపాలక ఎన్నికలకు 22,800కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయన్న లోకేశ్
- ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోందని చెప్పడానికి నిదర్శనమని వ్యాఖ్య
Advertisement
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో లోకేశ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లాల్దుహోమాను శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఎన్నికలకు రికార్డు స్థాయిలో 22,800కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పార్టీ, ప్రతి వర్గం, నలుమూలల నుంచి అభ్యర్థులు ముందుకు రావడం ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోందనడానికి నిదర్శనమని అన్నారు.
ఒక్క ఓటు కూడా పడకముందే అక్రమాలు జరిగాయని ఆరోపించే వారు ఒక విషయం గుర్తుంచుకోవాలని లోకేశ్ హితవు పలికారు. "ఎన్నికల్లో గెలుపు క్షేత్రస్థాయిలో ఉంటుంది కానీ, పత్రికా సమావేశాల్లో కాదు. ప్రజలను ఎదుర్కోండి, ప్రజలే ఫలితాలను నిర్ణయిస్తారు" అని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే.