అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ అజామ్ సరికొత్త మైలురాయి
Advertisement
- అంతర్జాతీయ క్రికెట్లో 16,000 పరుగుల మైలురాయిని అందుకున్న బాబర్ అజామ్
- ఈ ఘనత సాధించిన ఐదో పాకిస్థాన్ క్రికెటర్‌గా రికార్డ్
- 399 ఇన్నింగ్స్‌లలో ఈ మార్కును చేరుకున్న బాబర్ అజామ్
- పాక్ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు
- శ్రీలంకతో జరిగిన వన్డే ట్రై-సిరీస్ మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదు
Advertisement
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ తన కెరీర్లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 16,000 పరుగులు పూర్తి చేసిన ఐదో పాకిస్థాన్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆదివారం రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే ట్రై-సిరీస్ మ్యాచ్‌లో బాబర్ ఈ ఘనత సాధించాడు.
ఈ మైలురాయిని బాబర్ కేవలం 399 ఇన్నింగ్స్‌లలోనే చేరుకోవడం విశేషం. దీని ద్వారా పాకిస్థాన్ తరఫున అత్యంత వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అతని కంటే ముందు మహమ్మద్ యూసుఫ్ (388 ఇన్నింగ్స్‌లు), జావెద్ మియాందాద్ (398 ఇన్నింగ్స్‌లు) మాత్రమే ఉన్నారు.
ఓవరాల్ గా పాకిస్థాన్ తరఫున ఇంజమామ్-ఉల్-హక్, యూనిస్ ఖాన్, జావెద్ మియాందాద్, మహమ్మద్ యూసుఫ్ మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు బాబర్ అజామ్ వారి సరసన చేరాడు.
శ్రీలంకతో మ్యాచ్ ప్రారంభానికి ముందు బాబర్ ఈ రికార్డుకు కేవలం 7 పరుగుల దూరంలో ఉన్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు మూడో ఓవర్లో ఓపెనర్ సైమ్ అయూబ్ ఔటవ్వడంతో బాబర్ క్రీజులోకి వచ్చాడు. తనదైన శైలిలో చూడచక్కని డ్రైవ్‌లతో పరుగులు రాబట్టి వేగంగా ఈ మైలురాయిని దాటాడు. ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన బాబర్, 57 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేసి ఎషాన్ మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ప్రస్తుతం పాకిస్థాన్ గడ్డపై శ్రీలంక, ఇంగ్లండ్ జట్లతో వన్డే ట్రై-సిరీస్ జరుగుతోంది. డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ సిరీస్‌లో అక్టోబర్ 31న లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.