Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో మధ్యప్రదేశ్ సీఎం... చంద్రబాబు, పవన్‌తో వేర్వేరుగా భేటీ

Mohan Yadav visits AP and meets Chandrababu Naidu and Pawan Kalyan separately
Advertisement
  • ఏపీలో పర్యటించిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
  • సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ
  • మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశం
  • పులుల సంరక్షణ, అడవి దున్నల తరలింపుపై ఇరువురి మధ్య చర్చ
  • త్వరలో మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తానని తెలిపిన పవన్ కల్యాణ్
Advertisement
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు.

ముందుగా ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన మోహన్ యాదవ్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం నివాసానికి వచ్చిన ఆయనకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. అనంతరం నేతలు కాసేపు ముచ్చటించారు.

మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌తో మోహన్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) పరిధిలో పులుల సంరక్షణ చర్యలను బలోపేతం చేయడంపై మాట్లాడారు. అలాగే, జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా మధ్యప్రదేశ్ నుంచి గౌర్ (అడవి దున్నలు)ను NSTRకు తరలించే ఒప్పందాన్ని వేగవంతం చేయాలని పవన్ కల్యాణ్ కోరారు. ఈ సందర్భంగా త్వరలోనే తాను మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తానని పవన్ తెలిపారు.

సమావేశం అనంతరం పవన్ కల్యాణ్.. మోహన్ యాదవ్‌ను ఉప్పాడ పట్టు శాలువాతో సత్కరించి, కొండపల్లి, శ్రీకాళహస్తి కళాకృతులతో పాటు అరకు కాఫీని బహూకరించారు. ప్రతిగా మోహన్ యాదవ్, శ్రీ ఓంకారేశ్వర స్వామి ప్రతిమను, జ్యోతిర్లింగ క్షేత్ర ప్రసాదాన్ని పవన్‌కు అందజేశారు.
Advertisement
Advertisement
Mohan Yadav
Chandrababu Naidu
Pawan Kalyan
Andhra Pradesh
Tiger Conservation
Vijayawada

More Telugu News