Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

164 కిలోమీటర్ల పొడవు.. ప్రపంచంలోనే పొడవైన వంతెన ఎక్కడుందో తెలుసా?

Danyang Kunshan Grand Bridge is the worlds longest bridge at 164 kilometers long
Advertisement
  • చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఉన్న డాన్యాంగ్‌-కున్‌షాన్‌ గ్రాండ్‌ బ్రిడ్జ్‌
  • గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెన
  • బీజింగ్‌-షాంఘై హైస్పీడ్‌ రైల్వే మార్గంలో ఇది కీలక భాగం 
  • ఆ ప్రాంతంలోని కాలువలు, సరస్సులు, నీటి మార్గాలు, లోతట్టు ప్రాంతాల వల్లే వంతెన నిర్మాణం
  • 2011 జూన్‌లో బీజింగ్‌-షాంఘై హైస్పీడ్‌ రైల్వే ప్రారంభం
Advertisement
ప్రపంచంలో ఎన్నో భారీ వంతెనలు ఉన్నాయి. నదులు, సముద్రాలు, లోయలు, పర్వత ప్రాంతాలను దాటేందుకు వీటిని నిర్మిస్తుంటారు. అయితే చైనాలో ఉన్న ఓ వంతెన మాత్రం పొడవులో ప్రపంచ రికార్డు సృష్టించింది. అదే డాన్యాంగ్‌-కున్‌షాన్‌ గ్రాండ్‌ బ్రిడ్జ్‌. దీని పొడవు ఏకంగా 164 కిలోమీటర్లు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రకారం ఇదే ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెన.

చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఉన్న ఈ నిర్మాణం సాధారణ రోడ్డు వంతెన కాదు. ఇది భారీ రైల్వే వయాడక్ట్‌. బీజింగ్‌-షాంఘై హైస్పీడ్‌ రైల్వే మార్గంలో ఇది కీలక భాగంగా ఉంది. ఈ రైలు మార్గం చైనాలోని రెండు ప్రధాన నగరాలను కలుపుతుంది.

ఈ వంతెనను నిర్మించడానికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులే. అక్కడ కాలువలు, సరస్సులు, నీటి మార్గాలు, వరి పొలాలు, లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. నేలపై నేరుగా రైల్వే ట్రాక్‌ నిర్మించడం చాలా కష్టంగా ఉండటంతో ఇంజినీర్లు వేలాది పిల్లర్లపై ఎత్తుగా ఈ రైల్వే వయాడక్ట్‌ను నిర్మించారు.

దీంతో రైళ్లు నీటి ప్రాంతాలు, వరదలకు గురయ్యే ప్రాంతాలు, వ్యవసాయ భూముల మీదుగా ఎలాంటి అడ్డంకి లేకుండా నిరంతరంగా ప్రయాణించగలుగుతున్నాయి. 164 కిలోమీటర్ల పొడవు అంటే ఒక నగరం నుంచి మరో నగరానికి ఉండే దూరంతో సమానం.

బీజింగ్‌-షాంఘై హైస్పీడ్‌ రైల్వేను 2011 జూన్‌లో ప్రారంభించారు. ఈ మార్గంలోనే సుమారు 114 కిలోమీటర్ల పొడవైన లాంగ్‌ఫాంగ్‌-కింగ్‌షియన్‌ వయాడక్ట్‌ కూడా ఉంది. అయినా ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెన రికార్డు మాత్రం డాన్యాంగ్‌-కున్‌షాన్‌ గ్రాండ్‌ బ్రిడ్జ్‌దే.

సాధారణంగా వంతెన అంటే నది లేదా సముద్రంపై నిర్మించిన నిర్మాణం గుర్తుకు వస్తుంది. కానీ డాన్యాంగ్‌-కున్‌షాన్‌ గ్రాండ్‌ బ్రిడ్జ్‌ ప్రధానంగా రైల్వే ట్రాక్‌ కోసం నిర్మించిన భారీ వయాడక్ట్‌.
Advertisement
Advertisement
Danyang Kunshan Grand Bridge
World longest bridge
China railway viaduct
Beijing Shanghai High Speed Railway
Jiangsu Province China
Guinness World Record bridge

More Telugu News