Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిద్రపోవడమే ఓ పోటీ.. గెలిస్తే లక్షల్లో బహుమతి.. ఎక్కడంటే?

Sleeping is a competition win lakhs in prize money find out where
Advertisement
  • టోక్యోలో 'మ్యాట్ రేస్' పేరుతో వినూత్న నిద్రల పోటీ
  • వేగంగా, గాఢంగా నిద్రపోయిన వారిని విజేతగా ప్రకటన
  • గెలిచిన వారికి 2 మిలియన్ యెన్లకు పైగా భారీ బహుమతి
  • నిద్రలేమితో బాధపడుతున్న జపాన్‌లో అవగాహనకే ఈవెంట్
  • పోటీలో పాల్గొన్న డజన్ల కొద్దీ 'కాంపిటేటివ్ స్లీపర్స్'
Advertisement
ఎప్పుడూ పనిలో నిమగ్నమై, తీవ్రమైన అలసటతో ఉండే జపాన్‌లో ఓ వినూత్న పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వేగంగా, గాఢంగా నిద్రపోవడమే ఈ పోటీలోని టాస్క్. గెలిచిన వారికి ఏకంగా 2 మిలియన్ యెన్లకు పైగా (భారత కరెన్సీలో సుమారు రూ.12 లక్షలు) బహుమతిగా అందిస్తారు. టోక్యోలో 'మ్యాట్ రేస్' పేరుతో ఓ పరుపుల తయారీ కంపెనీ ఈ విచిత్రమైన పోటీని నిర్వహించింది.

నిన్న‌ జరిగిన ఈ పోటీలో తమను తాము 'కాంపిటేటివ్ స్లీపర్స్' అని పిలుచుకునే డజన్ల కొద్దీ పాల్గొన్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓ గదిలో తక్కువ కాంతిలో, సౌకర్యవంతమైన పరుపులపై వీరంతా 90 నిమిషాల పాటు నిద్రపోయారు. ప్రతి ఒక్కరి తలకు స్లీప్ ట్రాకింగ్ పరికరాలను అమర్చారు. 

ఎవరు ఎంత వేగంగా నిద్రలోకి జారుకున్నారు, ఎంత గాఢంగా నిద్రపోయారు అనే అంశాల ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. కొందరు తమ పక్కన ఇష్టమైన టెడ్డీబేర్లను పెట్టుకుని నిద్రపోవడం కనిపించింది.

జపాన్ ప్రజలు తీవ్రమైన నిద్రలేమితో బాధపడుతున్నారని, వారిలో నిద్రపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని నిర్వాహక సంస్థ 'కోలా స్లీప్ జపాన్' క్రియేటివ్ డైరెక్టర్ రిచిరో నకమా తెలిపారు. 

"జపాన్ ప్రజలు చాలా కష్టపడి పనిచేస్తారు. నిద్రను ఇలా ఒక పోటీగా మార్చడం ద్వారా, అందరూ కలిసి నిద్రపోవడం, దానిపై ఆసక్తి పెంచుకోవడం సాధ్యమవుతుంది" అని ఆయన వివరించారు. 

ఓఈసీడీ (Organisation for Economic Co-operation and Development)) 2021 డేటా ప్రకారం.. జపనీయులు రోజుకు సగటున 7 గంటల 24 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నారని, ఇది ఓఈసీడీ దేశాల్లో అత్యంత తక్కువని తేలింది. ఎక్కువ పని గంటలు, సుదూర ప్రయాణాలు దీనికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

ఈ పోటీలో పాల్గొన్న 32 ఏళ్ల చిసాటో హోండా మాట్లాడుతూ.. "సమయం ఇట్టే గడిచిపోయింది. ఇంకాస్త ఎక్కువసేపు నిద్రపోతే బాగుండేదనిపించింది. ఇది చాలా సంతోషకరమైన పోటీ" అని తన అనుభవాన్ని పంచుకున్నారు. 

ఈ పోటీలో 'సుయిమీ' అనే మహిళ విజేతగా నిలిచారు. బహుమతిగా వచ్చిన డబ్బుతో తాను వేరుగా ఇల్లు తీసుకుంటానని, యువరాణి బెడ్ లాంటిది కొనుక్కుంటానని ఆమె ఆనందంగా తెలిపారు.
Advertisement
Advertisement
Koala Sleep Japan
Japan Sleeping Competition
Tokyo Mattress Race
Competitive Sleeping
Sleep Deprivation Japan
Suimi Sleep Contest Winner

More Telugu News