Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రంలో పటిష్ఠ శాంతిభద్రతల వల్లే పెట్టుబడులు వస్తున్నాయి: మంత్రి అచ్చెన్న

Atchannaidu says investments coming to state due to strong law and order
Advertisement
  • శ్రీకాకుళంలో కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న అచ్చెన్నాయుడు
  • గత 8 నెలల్లో 5,800 పోలీసు పోస్టులు భర్తీ చేశామని వెల్లడి
  • మరో 1,156 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామన్న అచ్చెన్నాయుడు
Advertisement
రాష్ట్ర ప్రగతికి శాంతిభద్రతలే పునాది అని, ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ పటిష్ఠంగా ఉండటం వల్లే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించగలుగుతున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కానిస్టేబుళ్ల పాసింగ్-అవుట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

10 నెలల కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది నూతన కానిస్టేబుళ్లను మంత్రి అభినందించారు. పోలీసు వృత్తిలోకి అడుగుపెడుతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు ఉద్యోగం కేవలం జీవనోపాధి మాత్రమే కాదని, సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత అని గుర్తుచేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పోలీసు నియామకాలపై మంత్రి కీలక ప్రకటన చేశారు. గత 8 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,800 పోలీసు పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. తాజాగా మరో 1,156 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇకపై ప్రతి ఏటా క్రమం తప్పకుండా పోలీసు నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. నేరాల నియంత్రణకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
Atchannaidu
Andhra Pradesh Police Recruitment
Law and Order Andhra Pradesh
Srikakulam Police Parade
Police Jobs Notification
AP State Investments

More Telugu News