Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్యామిలీ కోర్టులోనే భార్యపై భర్త దాడి.. గొంతు నులిమి హత్యాయత్నం

Husband attacks wife in family court and attempts to murder her
Advertisement
  • భరణం కేసు విచారణ నేపథ్యంలో ఘటన
  • గొంతు నులిమి హత్యాయత్నం చేశారని బాధితురాలి ఆరోపణ
  • దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
  • దాడికి సంబంధించిన వీడియో క్లిప్‌ను పోలీసులకు అందజేత
Advertisement
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ ఫ్యామిలీ కోర్టు ప్రాంగణంలో దారుణం చోటుచేసుకుంది. భరణం కేసు విచారణకు హాజరైన ఓ మహిళపై ఆమె భర్త, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి దాడికి తెగబడ్డారు. తనను గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పురందర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ప్రియా త్రిపాఠికి, బ్రిజ్‌మన్‌గంజ్ ప్రాంతానికి చెందిన మనీష్ కుమార్ మిశ్రాతో వివాహమైంది. భర్త, అత్తింటివారితో తలెత్తిన విభేదాల కారణంగా ఆమె భరణం కోరుతూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ రెండు రోజుల క్రితం జరిగింది.

విచారణ ముగిసిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రియా త్రిపాఠి, ఆమె తండ్రి లక్ష్మీకాంత్, సోదరి ప్రియాంక కోర్టు భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఆమె భర్త మనీష్ కుమార్ మిశ్రా, తన బంధువులు ప్రిన్స్ మిశ్రా, సతీష్ మిశ్రాతో కలిసి వెనుక నుంచి వచ్చి వారిపై దాడికి పాల్పడ్డారు. ప్రియను కింద పడేసి గొంతు నులిమి చంపేసేందుకు ప్రయత్నించగా, అడ్డుకోబోయిన ఆమె తండ్రి, సోదరిపై కూడా నిందితులు దాడి చేశారు.

అక్కడే ఉన్న కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే స్పందించి దాడిని అడ్డుకున్నారు. కేసు కొనసాగిస్తే చంపేస్తామని నిందితులు తనను బెదిరించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె కొత్వాలి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు, దాడికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను కూడా సాక్ష్యంగా సమర్పించారు.
Advertisement
Advertisement
Manish Kumar Mishra
Maharajganj Family Court
Husband attacks wife in court
Uttar Pradesh crime news
Maintenance case dispute

More Telugu News