Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చరిత్ర సృష్టించిన 'మండాడి' సినిమా.. 100 కోట్ల క్లబ్ లోకి సూరి, సుహాస్ మూవీ

Mandadi movie creates history Soori and Suhas film enters 100 crore club
Advertisement
  • ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'మండాడి'
  • సూరి కెరీర్లో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన తొలి చిత్రం
  • మత్స్యకారుల జీవితం, పడవల పోటీల నేపథ్యంలో సినిమా
Advertisement

హాస్య నటుడి నుంచి కథానాయకుడిగా మారి వైవిధ్యభరిత చిత్రాలతో మెప్పిస్తున్న తమిళ నటుడు సూరి, టాలీవుడ్ హీరో సుహాస్ నటించిన ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, అద్భుతమైన ప్రజాదరణతో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటింది. కథానాయకుడిగా సూరి కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా ‘మండాడి’ ఘనత సాధించినట్లు నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది.

  

దర్శకుడు మదిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ చిత్రంలో తీరప్రాంత పడవల పోటీలు, మత్స్యకారుల జీవితం, భావోద్వేగాలను ప్రధానంగా చూపించారు. తెలుగు నటుడు సుహాస్ ఈ చిత్రం ద్వారా తమిళ సినీ రంగ ప్రవేశం చేయడమే కాకుండా నెగెటివ్ పాత్రలో తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. 


వీరితో పాటు మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో మెప్పించారు. సముద్రం మధ్యలో చిత్రీకరించిన ఉత్కంఠభరితమైన పడవల పోటీ ఘట్టాలు, జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, ఎస్.ఆర్.కథిర్ ఛాయాగ్రహణం ఈ చిత్ర విజయానికి ప్రధాన బలాలుగా నిలిచాయి. ప్రేక్షకుల ఆదరణే ఈ అపార విజయానికి కారణమని చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది.  

Advertisement
Advertisement
Mandadi Movie
Actor Soori
Actor Suhas
100 Crore Club
Madhimaran Pugazhendhi
Tamil Cinema Box Office

More Telugu News