Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో అద్భుతం.. 8 నిమిషాల్లోనే యూఏఈ పౌరుడికి కొత్త పాస్‌పోర్ట్!

Miracle at Dubai Airport New passport in just 8 minutes
Advertisement
  • ప్రయాణానికి ముందురోజు పాస్‌పోర్ట్ గడువు సమస్య
  • దుబాయ్ విమానాశ్రయంలో 8 నిమిషాల్లోనే రెన్యువల్
  • యూఏఈ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉన్న సేవ
  • డిజిటల్ వ్యవస్థతో వేగవంతమైన సేవలు అందిస్తున్న యూఏఈ
Advertisement
విదేశీ ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకున్నాక, చివరి నిమిషంలో పాస్‌పోర్ట్ గడువు ముగిసిపోతోందని తెలిస్తే ఎలా ఉంటుంది? అలాంటి తీవ్రమైన టెన్షన్‌కు దుబాయ్ ప్రభుత్వం కేవలం 8 నిమిషాల్లో తెరదించింది. యూఏఈ పౌరుడికి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిమిషాల వ్యవధిలోనే పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించి, తమ సేవల సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

ఎమిరేట్స్ పౌరుడొకరు మరుసటి రోజు ప్రయాణానికి సిద్ధమవుతుండగా తన పాస్‌పోర్ట్ గడువు మరో నెలలో ముగియనుందని గమనించాడు. అయితే, తాను వెళ్లాల్సిన దేశానికి పాస్‌పోర్ట్‌పై కనీసం ఆరు నెలల చెల్లుబాటు తప్పనిసరి. దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతుండగా, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పాస్‌పోర్ట్ పునరుద్ధరణ కేంద్రాన్ని సంప్రదించమని స్నేహితులు సూచించారు.

వెంటనే విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు, అక్కడి అధికారులు 10 నిమిషాల్లో పని పూర్తవుతుందని చెప్పారు. కానీ, కేవలం ఎనిమిది నిమిషాల్లోనే కొత్త పాస్‌పోర్ట్‌ను చేతికి అందించడంతో ఆ ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు. ఈ అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోగా, అది వైరల్ అయింది. "దుబాయ్ ఎయిర్‌పోర్ట్ కంటే వేగవంతమైనది ఏదీ లేదు. వారి సేవలు అద్భుతం" అని ఆయన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 అరైవల్స్ ప్రాంతంలో ఉన్న ఈ ఇమ్మిగ్రేషన్ సెంటర్, కేవలం యూఏఈ పౌరులకు మాత్రమే 24 గంటలూ ఈ సేవను అందిస్తోంది. గతంలో 35 నిమిషాలు పట్టే ఈ ప్రక్రియను, డిజిటల్ వ్యవస్థ ద్వారా ఇప్పుడు 7 నుంచి 8 నిమిషాలకు తగ్గించారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా, 2025 ఆగస్టు నుంచి ఏడాదిలోపు గడువున్న పాస్‌పోర్టులను కూడా పునరుద్ధరించుకునే వెసులుబాటును యూఏఈ ప్రభుత్వం కల్పించింది.
Advertisement
Advertisement
Dubai International Airport
Passport Renewal
UAE Citizens
Dubai Immigration
Terminal 3
Travel Documents

More Telugu News