Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విడ్డూరం.. యువకుడి కడుపులో గర్బాశయం!

Delhi man found with uterus and fallopian tubes in stomach
Advertisement
  • ఢిల్లీలో 26 ఏళ్ల యువకుడిలో మహిళల అవయవాలు
  • సంతానలేమి సమస్యతో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు
  • స్కానింగ్‌లో గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నట్టు గుర్తింపు
  • ఇది ప్రపంచంలోనే అరుదైన వైద్య పరిస్థితి అని వెల్లడి
  • శస్త్రచికిత్స చేసి గర్భాశయాన్ని తొలగించిన వైద్యులు
Advertisement
ఢిల్లీలో ఒక అత్యంత అరుదైన వైద్య వింత వెలుగులోకి వచ్చింది. సంతానలేమి సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 26 ఏళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉండటాన్ని గుర్తించిన వైద్యులు విస్మయానికి గురయ్యారు. సాధారణ పరీక్షల క్రమంలోనే ఈ వింత విషయం బయటపడింది.

ఢిల్లీకి చెందిన సదరు యువకుడు సంతాన సంబంధిత సమస్యలతో వైద్యులను సంప్రదించగా, అతనికి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ తరుణంలో పొత్తికడుపులో మహిళలకు ఉండే గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నట్లు తేలింది. వైద్య పరిభాషలో ఈ అరుదైన పరిస్థితిని 'పర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్' అని పిలుస్తారని వైద్యులు వెల్లడించారు. జన్యుపరంగా పురుషుడైనప్పటికీ, వారి శరీరంలో స్త్రీ పునరుత్పత్తి అవయవాలు కూడా అభివృద్ధి చెందడం ఈ సిండ్రోమ్ యొక్క ప్రధాన లక్షణం.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి కేసులు 300 కంటే తక్కువగానే నమోదయ్యాయని వైద్య నిపుణులు వివరించారు. ఇది అత్యంత అరుదైన స్థితి కావడంతో దీనిని గుర్తించడం కూడా కష్టతరమని వారు పేర్కొన్నారు. అనంతరం వైద్యులు ఆ యువకుడికి శస్త్రచికిత్స నిర్వహించి, గర్భాశయ సంబంధిత భాగాలను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Advertisement
Advertisement
Delhi Man
Persistent Mullerian Duct Syndrome
Uterus in Male
Rare Medical Case
Infertility Treatment

More Telugu News