ఏపీలో రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో భారీవర్షాలు

06-09-2026 Sun 15:35 | Andhra
Advertisement
  • ఏపీలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
  • మరో 3 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాల హెచ్చరిక
  • గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు
  • ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచన
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. రాబోయే మూడు గంటల్లో ఏడు జిల్లాల్లో తీవ్రమైన ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు 'రెడ్ అలర్ట్' ప్రకటించింది.

ఈ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. వర్ష తీవ్రత, పిడుగుపాటు ప్రమాదం అధికంగా ఉండటంతో ఇంతకుముందు జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్‌ను తాజాగా రెడ్ అలర్ట్‌గా సవరించినట్లు వెల్లడించింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఆకస్మిక మార్పుల దృష్ట్యా ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు, వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు కోరారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద, శిథిల భవనాల్లో ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Andhra Pradesh WeatherAPSDMA WarningHeavy Rains in APRed Alert Districts APThunderstorms and LightningAP Weather Update

More Telugu News

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more