ఈశ్వరా.. పవనేశ్వరా: పవన్ కల్యాణ్‌కు బండ్ల గణేశ్ శుభాకాంక్షలు
- నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు
- సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
- ఆయనకు శిష్యుడిగా ఉండటం తన పూర్వజన్మ సుకృతమన్న బండ్ల గణేశ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు అంబరాన్నంటాయి. సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ వీరాభిమాని, నిర్మాత బండ్ల గణేశ్ చేసిన సుదీర్ఘమైన ఎమోషనల్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలో పవన్ కల్యాణ్ సినిమాల వేడుకల్లో తన పూనకాల ఉపన్యాసాలతో ఊపేసిన బండ్లన్న... నేడు అదే స్థాయిలో తన అభిమానాన్ని అక్షరాల్లో ఆవిష్కరించారు.
"ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. మీ పేరు వింటే పూనకం, మీ పేరు వింటే పులకం, మీ రూపం చూస్తే పులకింత, మీ మాట వింటే ధైర్యం, మీ అడుగు పడితే సంచలనం" అంటూ పవన్ ను ఆకాశానికెత్తేశారు. పవన్ కేవలం ఒక హీరో మాత్రమే కాదని, కోట్లాది మందికి ఒక బలమైన భావోద్వేగమని, హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అద్భుత శక్తి అని కొనియాడారు. ఆయనకు శిష్యుడిగా ఉండటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పవర్ స్టార్ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.