హరికృష్ణకు చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళి

02-09-2026 Wed 10:45 | Andhra
Advertisement
  • మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ 70వ జయంతి
  • సోషల్ మీడియా వేదికగా తమ జ్ఞాపకాలను పంచుకున్న చంద్రబాబు, లోకేశ్
  • అందరి హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతారన్న చంద్రబాబు
  • ప్రజానేతగా అందరి ప్రేమాభిమానాలు పొందారన్న నారా లోకేశ్
Advertisement
నటుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ స్వర్గీయ నందమూరి హరికృష్ణ 70వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘనంగా నివాళులర్పించారు. సోషల్ మీడియా వేదికగా హరికృష్ణతో తమకున్న అనుబంధాన్ని, ఆయన జ్ఞాపకాలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. "మా కుటుంబ సభ్యులు, స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి 70వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. సినీ రంగంలోనూ, రాజకీయాల్లోనూ తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర వేసిన హరికృష్ణ గారు అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు" అని పేర్కొన్నారు. ఆయన స్మృతిలో నివాళులర్పిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

నారా లోకేశ్ సైతం హరికృష్ణను స్మరించుకుంటూ భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. "టీడీపీ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు మా నందమూరి హరికృష్ణ మావయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నాను. చెదరని చిరునవ్వు, ఆత్మీయత ఆయన సొంతం. హరి మావయ్య నటుడిగా, ప్రజా నేతగా అందరి ప్రేమాభిమానాలను పొందారు. ఆయన భౌతికంగా మనకు దూరమైనా, తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు" అని లోకేశ్ తన నివాళిలో పేర్కొన్నారు.
Advertisement
Nandamuri HarikrishnaChandrababu NaiduNara LokeshTDPHarikrishna Birth AnniversaryNandamuri Family

More Telugu News

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more