హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు.. ఇక ఇక్కడే గ్లోబల్ విద్య!

01-09-2026 Tue 18:36 | Telangana
Advertisement
  • హైదరాబాద్‌లో లండన్, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీల క్యాంపస్‌లు
  • భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లోనే వాటి ఏర్పాటు
  • గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వ చర్యలు
  • హార్వర్డ్ వర్సిటీ సైతం కోర్సులు అందించేందుకు ఆసక్తి
  • సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఫలితంగా కుదిరిన ఒప్పందాలు
Advertisement
హైదరాబాద్ నగరం గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా ఎదిగే క్రమంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. బ్రిటన్‌కు చెందిన ప్రతిష్టాత్మక 'యూనివర్సిటీ ఆఫ్ లండన్', అమెరికాలోని బోస్టన్‌కు చెందిన 'నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ' తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నాయి. ఈ రెండు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' ప్రతినిధి బృందం బ్రిటన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే, రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో, అధికారుల బృందం అగ్రరాజ్యంలో పర్యటించింది. ఈ పర్యటనల్లో భాగంగా నిర్వహించిన ఉన్నత స్థాయి చర్చలు సఫలీకృతం కావడంతో, ఈ ప్రఖ్యాత విద్యాసంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు అంగీకరించాయి.

వీటితో పాటు, ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం సైతం తెలంగాణలో స్వల్పకాలిక 'ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లు', విభిన్న కోర్సులను అందించేందుకు ఆసక్తి కనబరిచినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థలతో జరిపిన చర్చలు కూడా ఫలవంతమయ్యాయి.

ఈ పరిణామంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం కావడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, విద్యపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్ర యువత విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్‌‍లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను పొందేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. నూతన జాతీయ విద్యా విధానం కింద విదేశీ వర్సిటీలకు లభించిన వెసులుబాటును వినియోగించుకుంటూ, ఉన్నత విద్యా రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది.
Advertisement
Revanth ReddyHyderabad Global EducationUniversity of London HyderabadNortheastern University IndiaTelangana Rising Delegation

More Telugu News

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more