Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓలా కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్క ఛార్జ్‌తో 301 కి.మీ

Ola new electric scooter 301 km range with single charge
Advertisement
  • ఓలా ఎస్‌1జెడ్‌ ప్రారంభ ధర రూ.79,999
  • 5.1 kWh మోడల్‌ ధర రూ.99,999
  • గరిష్ఠంగా 301 కి.మీ. రేంజ్‌
  • గరిష్ఠ వేగం గంటకు 70 కి.మీ
  • రూ.999తో బుకింగ్‌
Advertisement
ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ మరో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్‌ కొత్త ఎస్‌1జెడ్‌ సిరీస్‌ను ఆవిష్కరించారు. దీని ప్రారంభ ధర రూ.79,999గా నిర్ణయించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘భారత్‌ సెల్‌’ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగిస్తున్న తొలి మాస్‌ మార్కెట్‌ స్కూటర్లలో ఇది ఒకటని కంపెనీ తెలిపింది.

ఎస్‌1జెడ్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 3.1 kWh బ్యాటరీ వేరియంట్‌ ధర రూ.79,999గా ఉంది. 5.1 kWh వేరియంట్‌ ధర రూ.99,999. ఇవి ఎక్స్‌షోరూమ్‌ ధరలు. రూ.999 చెల్లించి ఓలా ఎలక్ట్రిక్‌ అధికారిక వెబ్‌సైట్‌లో స్కూటర్‌ను రిజర్వ్‌ చేసుకోవచ్చు. రాష్ట్రం, రిజిస్ట్రేషన్‌, ఇతర ఛార్జీలను బట్టి ఆన్‌రోడ్‌ ధర మారుతుంది.

బ్యాటరీ సామర్థ్యానికి అనుగుణంగా రేంజ్‌లోనూ తేడా ఉంది. 3.1 kWh మోడల్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే గరిష్ఠంగా 179 కి.మీ. ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. 5.1 kWh వెర్షన్‌ 301 కి.మీ. వరకు రేంజ్‌ ఇస్తుందని తెలిపింది. రెండు మోడళ్ల గరిష్ఠ వేగం గంటకు 70 కి.మీ. వీటిలో 4 kW పీక్‌ పవర్‌ మోటార్‌ ఉంటుంది.

ఎస్‌1జెడ్‌లో జీపీఎస్‌ ట్రాకింగ్‌, క్రూజ్‌ కంట్రోల్‌, రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌, రివర్స్‌ మోడ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓవర్‌-ది-ఎయిర్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు కూడా అందుతాయి. ఓలా ఎలక్ట్రిక్‌ యాప్‌ ద్వారా రైడ్‌ వివరాలను తెలుసుకోవచ్చు. ఇరుకైన ప్రదేశాల్లో స్కూటర్‌ను సులభంగా తిప్పేందుకు ‘ఈజీ పార్క్‌’ ఫీచర్‌ ఇచ్చారు.

ఎస్‌1జెడ్‌ నాలుగు రంగుల్లో లభిస్తుంది. వైట్‌, ఆంత్రాసైట్‌, స్కై స్ప్లాష్‌ బ్లూ, మాచా గ్రీన్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. రెండు వేరియంట్లలోనూ 12 అంగుళాల వీల్స్‌ ఉన్నాయి. 3.1 kWh మోడల్‌ డెలివరీలు 2026 డిసెంబరులో ప్రారంభం కానున్నాయి. 5.1 kWh మోడల్‌ డెలివరీలు 2027 మార్చి నుంచి మొదలవుతాయి.
Advertisement
Advertisement
Ola Electric
Ola S1Z electric scooter
Bhavish Aggarwal
Bharat Cell LFP battery
Electric scooter price India
Ola S1Z delivery dates

More Telugu News