Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రాణాలతో చెలగాటం.. లోకల్ ట్రైన్‌కు వేలాడుతూ యువతి ప్రయాణం!

Playing with life Woman travels hanging to a Mumbai local train
Advertisement
  • ముంబై లోకల్ ట్రైన్‌లో యువతి ప్రమాదకర ప్రయాణం
  • రద్దీ కారణంగా డోర్ బయట వేలాడుతూ ప్రయాణం
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • ప్రాణాలతో చెలగాటం వద్దంటూ నెటిజన్ల హితవు
Advertisement
ముంబై లోకల్ రైలులో ఓ యువతి అత్యంత ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కోచ్‌లో రద్దీ అధికంగా ఉండటంతో లోపలకి వెళ్లలేక, ఆ యువతి తలుపు బయట ఉన్న ఇనుప రాడ్లను పట్టుకుని వేలాడుతూ ప్రయాణించింది. ఈ దృశ్యాలు చూసిన వారిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.

ప్రయాణంలో భాగంగా ఒక రైల్వే బ్రిడ్జిని దాటుతున్న సమయంలో అక్కడ ఉన్న ఇనుప గ్రిల్స్ ఆమెకు అత్యంత చేరువగా వచ్చాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో నెటిజన్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, "రైళ్లు మళ్లీ వస్తాయి కానీ, పోయిన ప్రాణాలు తిరిగి రావు", "ఏదైనా అపశ్రుతి చోటుచేసుకుంటే ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు" అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ముంబై నగర జీవనరేఖలుగా భావించే లోకల్ రైళ్లలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. అయినప్పటికీ, రద్దీ నెపంతో డోర్ల వద్ద వేలాడటం, ఫుట్‌బోర్డ్‌ ప్రయాణాలు చేయడం వంటివి ప్రాణాపాయానికి దారితీస్తాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. కాసేపు నిరీక్షించి మరో రైలులో వెళ్లాలే తప్ప, ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదని హితవు పలుకుతున్నారు.
Advertisement
Advertisement
Mumbai Local Train
Viral Video
Railway Safety
Mumbai News
Dangerous Train Stunt
Mumbai Lifeline

More Telugu News