డోర్లలో పొంచి ఉన్న ముప్పు.. టెస్లా సహా 40 లక్షల ఎలక్ట్రిక్ కార్లు వెనక్కి!
- డోర్ హ్యాండిల్స్‌లో భద్రతా లోపాలే ప్రధాన కారణం
- 29.8 లక్షల వాహనాలను వెనక్కి పిలుస్తోన్న టెస్లా
- 3.9 లక్షలకు పైగా కార్లను రీకాల్ చేసిన షియోమీ
- లీప్‌మోటార్ 3.7 లక్షలకు పైగా వాహనాలు వెనక్కి పిలుపు
భద్రతా లోపాల కారణంగా టెస్లా సహా పలు చైనా కార్ల తయారీ సంస్థలు భారీ సంఖ్యలో వాహనాలను వెనక్కి పిలుస్తున్నాయి. ప్రధానంగా కార్ల డోర్ హ్యాండిల్స్‌కు సంబంధించిన సమస్యలే ఇందుకు కారణం. మొత్తంగా 40 లక్షలకు పైగా వాహనాలపై రీకాల్ ప్రభావం పడుతోంది.
చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ ప్రకారం.. టెస్లా చైనాలో తయారు చేసినవి, దిగుమతి చేసుకున్నవి కలిపి సుమారు 29.8 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేస్తోంది. ఇందులో మోడల్ 3, మోడల్ వై, మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ ఉన్నాయి.
తీవ్రమైన ప్రమాదం జరిగి విద్యుత్ వ్యవస్థ పనిచేయకపోతే డోర్ హ్యాండిల్స్ సరిగా స్పందించకపోవచ్చని చైనా నియంత్రణ సంస్థ తెలిపింది. దీంతో కారులో ఉన్నవారు త్వరగా బయటకు రావడం కష్టమవుతుందని పేర్కొంది. బయట ఉన్న రక్షణ సిబ్బంది కారులోకి చేరడానికీ ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉందని వివరించింది.
ఈ ఏడాది చైనాలో ఇదే అతిపెద్ద వాహనాల రీకాల్‌గా అక్కడి మీడియా పేర్కొంది. డోర్ హ్యాండిల్స్‌పై చైనా ఇటీవలే దృష్టి పెంచింది. వచ్చే ఏడాది నుంచి కొత్త వాహనాల్లో ఇలాంటి హ్యాండిల్స్‌ను నిషేధించనున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించింది.
టెస్లాతో పాటు షియోమీ 3.9 లక్షలకు పైగా వాహనాలను వెనక్కి పిలుస్తోంది. లీప్‌మోటార్ 3.7 లక్షలకు పైగా కార్లను రీకాల్ చేస్తోంది. గీలీ, ఎక్స్‌పెంగ్ సహా మరికొన్ని చైనా సంస్థలు కూడా వాహనాలను వెనక్కి పిలుస్తున్నాయి.
రీకాల్ అనేది ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ ఎదుగుదలలో సహజమైన దశ అని చైనా ప్యాసింజర్ కార్ అసోసియేషన్ అధిపతి కుయ్ డోంగ్‌షు పేర్కొన్నారు. డిజైన్ కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. టెస్లా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల ద్వారా సమస్యను తగ్గించనుంది.