Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోల్కొండ కోట సమీపంలో బయటపడ్డ పురాతన సొరంగం

Ancient tunnel discovered near Golconda Fort
Advertisement
  • కుతుబ్ షాహీ కాలం నాటిదిగా భావిస్తున్న అధికారులు
  • అగ్నివీరుల శిక్షణ కోసం భూమి చదును చేస్తుండగా గుర్తింపు
  • సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పురావస్తు శాఖ
  • సొరంగం చూసేందుకు భారీగా తరలివచ్చిన స్థానికులు
Advertisement
హైదరాబాద్‌లోని చారిత్రాత్మక గోల్కొండ కోట సమీపంలో ఒక పురాతన సొరంగం బయటపడింది. ఇది కుతుబ్ షాహీ కాలం నాటిదిగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్నివీరుల శిక్షణ నిమిత్తం భూమిని చదును చేస్తుండగా ఈ సొరంగ మార్గం అనుకోకుండా వెలుగులోకి వచ్చింది.

గోల్కొండ కోట పరిసర ప్రాంతమైన అత్తాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నివీరుల శిక్షణ కోసం గోల్కొండ ఆర్టిలరీ అధికారులు ఎక్స్‌కవేటర్‌తో భూమిని ఎత్తుపల్లాలు లేకుండా మారుస్తుండగా, భూగర్భంలోని ఈ నిర్మాణం బయటపడింది. వెంటనే స్పందించిన అధికారులు పనులను నిలిపివేసి, కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు.

భారీ రాతి పలకలతో కప్పి ఉన్న ఈ సొరంగంలోకి వెళ్లేందుకు వీలుగా మార్గం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా జనసంచారం తక్కువగా ఉండే ఈ ప్రాంతంలో సొరంగం బయటపడిందన్న వార్త తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో పికెట్ ఏర్పాటు చేశారు. ఈ సొరంగం పొడవు ఎంత? లోపల ఏవైనా చారిత్రక కళాఖండాలు ఉన్నాయా? అనే అంశాలపై స్థానికులు, చరిత్రకారుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. పురావస్తు శాఖ చేపట్టబోయే తవ్వకాలతో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Advertisement
Golconda Fort
Ancient Tunnel
Hyderabad
Qutub Shahi Dynasty
Archaeological Survey of India
Agniveer Training Ground

More Telugu News